కావలసిన పదార్థాలు :
ఎముకల్లేని చికెన్.. అర కేజీ
అల్లం తరుగు.. 3 టీ.
వెల్లుల్లి పేస్ట్.. 2 టీ.
ఉల్లిపాయలు.. 4
ఎండుమిర్చి.. 15
టొమోటో గుజ్జు.. 4 టీ.
ధనియాలపొడి.. 2 టీ.
గరంమసాలా.. 1 టీ.
నూనె, ఉప్పు.. తగినంత
కొత్తిమీర.. కాస్తంత
బాదం పేస్ట్.. మూడు టీ.
తయారీ విధానం :
ఒక పాన్‌లో ఉల్లి ముక్కలు, అల్లం, వెల్లుల్లిలకు తగినంత నూనె వేసి వేయించాలి. దీనికి ధనియాలపొడి, గరంమసాలా కలపాలి. తరువాత టొమోటో గుజ్జు కలిపి కాసేపు వేయించాలి. ఆపై ఎండుమిర్చి పేస్ట్, బాదం పేస్ట్‌లను కూడా వేసి బాగా కలిపి వేగనివ్వాలి. చివర్లో చికెన్, ఉప్పు కలిపి కూర ఉడికేంతదాకా ఉంచి దించేయాలి. దీనిపై కొత్తిమీర తరుగు.. చీలికలుగా కోసిన పచ్చిమిర్చిలతో అలంకరించి వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.