కావలసిన పదార్థాలు :
చేపలు... అరకేజీ
చింతకాయలు... వంద గ్రా.
కారం... మూడు టీ.
ధనియాలపొడి... రెండు టీ.
అల్లం వెల్లుల్లి మిశ్రమం... రెండు టీ.
ఉల్లిపాయలు... రెండు
పచ్చిమిర్చి... నాలుగు
పసుపు... రెండు టీ.
నూనె... ఆరు టీ.
కరివేపాకు... 3 రెమ్మలు
కొత్తిమీర... తగినంత
జీలకర్ర... ఒక టీ.
తయారీ విధానం :
చేపముక్కల్ని కడిగి పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి ఉంచాలి. చింతకాయలు శుభ్రంగా కడిగి వేడినీళ్లలో వేసి కాసేపు ఉంచాలి. తరవాత పిసికి రసం తీయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోయాలి. మందపాటి పాత్రలో నూనె వేసి కాగాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
తరవాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగాక, ధనియాలపొడి వేసి బాగా కలిపి చేపముక్కలు వేయాలి. తరవాత చింతకాయల రసం పోయాలి. ఉడికేటప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉప్పు సరిచూడాలి. ముక్క ఉడికిన తరవాత దించి కొత్తిమీర చల్లితే పుల్లపుల్లని చింతకాయ చేపల పులుసు రెడీ అయినట్లే...!