Article Non Vegetarian %e0%b0%97%e0%b1%8b%e0%b0%ac%e0%b1%80 %e0%b0%9a%e0%b0%bf%e0%b0%95%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c %e0%b0%ae%e0%b0%b8%e0%b0%be%e0%b0%b2%e0%b0%be 109053000118_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోబీ చికెన్‌ మసాలా

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
బ్రాయిలర్‌ చికెన్... ఒక కేజీ
కాలీఫ్లవర్... పెద్దసైజుది ఒకటి
నూనె... 200 గ్రా.
ఉల్లిముద్ద... రెండు కప్పులు
టొమాటో ముక్కలు... రెండు కప్పులు
అల్లంవెల్లుల్లి ముద్ద... ఒక కప్పు
కారం... 4 టీ.
పచ్చిమిర్చి ముక్కలు... అర కప్పు
కొత్తిమీర తురుము: అర కప్పు
పచ్చి కొబ్బరి ముద్ద... ఒక కప్పు
గసాల ముద్ద... ఒక కప్పు
ధనియాల పొడి... 4 టీ.
గరంమసాలా... రెండ టీ.
పసుపు... అర టీ.ఉప్పు... తగినంత

తయారీ విధానం :
చికెన్‌ను శుభ్రం చేసి కొత్తిమీర తురుము, ధనియాల పొడి, మసాలా పొడి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కొబ్బరి, గసాల ముద్ద, ఒక టీస్పూను ఉప్పు వేసి ముక్కలకు పట్టించి కొద్దిసేపు ఊరనిచ్చి 2 విజిల్స్‌ వచ్చేవరకూ కుక్కర్‌లో ఉడికించి తీయాలి. కాలీఫ్లవర్‌ను చిన్న చిన్న రెమ్మలుగా విడదీసి శుభ్రంచేసి ఉడికించాలి.

కళాయిలో నూనె పోసి కాగాక, ఉల్లిముద్ద వేసి, దోరగా వేసి... అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి తురుము వేసి మంచివాసన వచ్చేవరకూ వేయించాలి. అందులో చికెన్‌ మిశ్రమం, కాలీఫ్లవర్‌, టొమాటో ముక్కలు కూడా వేసి ఉప్పు సరిజూసి, సిమ్‌లో ఉడికించాలి. కూర చిక్కగా అయిన తరువాత దించేయాలి.

Share this Story:

Follow Webdunia telugu