కావలసిన పదార్థాలు :
కోడిమాంసం... అరకిలో
పచ్చిమిర్చి... అయిదు
చింతపండు... 25 గ్రాములు
ఉప్పు... సరిపడా
పసుపు... సరిపడా
కొత్తిమీర... ఒక కట్ట
అల్లం... ఒక ముక్క
వెల్లుల్లిపాయ... ఒకటి
గసగసాలు... రెండు స్పూనులు
ఉల్లిపాయలు... రెండు
నూనె... 100 గ్రాములు
కారం... రెండు స్పూనులు
తయారీ విధానం :
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసి వుంచుకోవాలి. మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. చింతపండు నీళ్ళలో నాన బెట్టుకోవాలి. చింతపండు నీళ్ళల్లో నాన బెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి, గసగసాలు ముద్దగా నూరి పెట్టుకోవాలి. ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగాక ఉల్లి, పచ్చిమిర్చి వేసి, మాంసం మసాలాలు కలుపుకోవాలి. బాగా దోరగా మగ్గాక చింతపండు పులుసు పోసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు కూడా వేసి బాగా ఇగురుతుండగా దింపేయాలి.