Publish Date: Tue, 22 Jul 2008 (12:07 IST)
Updated Date: Tue, 22 Jul 2008 (12:06 IST)
కావలసిన పదార్ధాలు :
కోడి మాంసం మెత్తగా వున్నది... 250 గ్రాములు
వెల్లుల్లి... ఒకటి
గరం మసాలా... ఒక పాకెట్
పలావు బియ్యం... 250 గ్రాములు
ఉప్పు... సరిపడా
పసుపు... చిటికెడు
కారం... కొంచెం
నెయ్యి... 50 గ్రాములు
ఉల్లిపాయలు... మూడు
పచ్చిమిర్చి... మూడు
పెరుగు... ఒక కప్పు
అల్లం... ఒక ముక్క
తయారీ విధానం :
ముందుగా పలావు బియ్యాన్ని రాళ్ళు లేకుండా శుభ్రం చేసి, నానబెట్టి వుంచుకోవాలి. తరువాత కోడిమాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయలు వేసి, వేగిన తరువాత పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలియబెట్టాలి.
కొంచెం ఉడికాక మాంసం ముక్కల్ని కూడా అందులో వేసి ఉడకబెట్టాలి. ముక్కలు బాగా ఉడికిన తరువాత పెరుగు, కొత్తిమీర, వేసి దింపేయాలి. తరువాత ఒక పాత్రలో నీళ్లు పెట్టి, నీళ్ళు బాగా మరిగిన తరువాత అందులో నానబెట్టిన బియ్యాన్ని వేసి... ముప్పాతిక భాగం వుడికిన తరువాత దానిలో వున్న గంజిని వార్చేసి, అంతకుముందు తయారు చేసుకున్న మసాలాలన్నీ అందులో కలిపి, నెయ్యి వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. ఎసరు అంతా ఇంకిపోయి అన్నం పొడి పొడిగా తయారయినపుడు దించేయాలి. అంతే... వేడి వేడి కోడి పులావు రెడీ.