Article Non Vegetarian %e0%b0%95%e0%b0%b0%e0%b0%be%e0%b0%9a%e0%b1%80 %e0%b0%9a%e0%b1%87%e0%b0%aa%e0%b0%b2 %e0%b0%aa%e0%b1%81%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b1%81 109032800072_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరాచీ చేపల పులుసు

Advertiesment
వంటకాలు మాంసాహారం చేప ముక్కలు ఉల్లిపాయ అల్లం చింతపండు కొబ్బరిపాలు కోరు ఎండుమిర్చి కారం బియ్యం జీలకర్ర
కావలసిన పదార్థాలు :
చేపముక్కలు... అరకేజీ
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు... అర కప్పు
సన్నగా తరిగిన అల్లం ముక్కలు... ఒక టీ.
చిక్కటి చింతపండు పులుసు... రెండు టీ.
కొ్బ్బరిపాలు... అర కప్పు
కొబ్బరి కోరు... అర కప్పు
ఎండుమిర్చి... రెండు
కారం... రెండు టీ.
నానబెట్టిన బియ్యం... రెండు టీ.
జీలకర్ర... ఒక టీ.
ధనియాలు.. రెండు టీ.
పసుపు... అర టీ.
నూనె... అర కప్పు
ఉప్పు... తగినంత
వేయించిన మెంతిపిండి... రెండు టీ.

తయారీ విధానం :
శుభ్రంగా కడిగిన చేప ముక్కలకు ఉప్పు, కారం, పసుపు పట్టించి అరగంటసేపు పక్కన ఉంచాలి. ధనియాలు, జీలకర్రను దోరగా వేయించి, అందులోనే ఎండుమిర్చి, నానబెట్టిన బియ్యం, కొబ్బరికోరు కలిపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

ఒక బాణలిలో నూనె పోసి కాగిన తరువాత ఉల్లిముక్కలు వేసి రెండు నిమిషాలపాటు వేయించి, ఆపై అల్లం ముక్కలను కూడా వేసి దోరగా వేయించుకోవాలి. తరువాత అందులోనే చేప ముక్కలు వేసి నీరంతా ఇంకిపోయి, నూనె పైకి తేలేంతదాకా మీడియం మంటమీద ఉడికించాలి.

ఇప్పుడు గ్రైండ్ చేసిన మసాలా మిశ్రమాన్ని చేపలలో వేసి మరో పది నిమిషాలు ఉడికించాలి. ఆపై.. చింతపండు పులుసు వేసి రెండు గ్లాసుల నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. కూర బాగా ఉడికి ముక్క గట్టిపడి గ్రేవీ చిక్కబడుతుండగా... కొబ్బరిపాలు పోసి మూతపెట్టి, మీడియం మంటపై పదినిమిషాలు ఉడికించి.. చివర్లో మెంతిపొడి చల్లి దించేయాలి. అంతే కరాచీ చేపల పులుసు సిద్ధమయినట్లే...!

Share this Story:

Follow Webdunia telugu