Publish Date: Sat, 02 Aug 2008 (16:15 IST)
Updated Date: Sat, 02 Aug 2008 (16:15 IST)
కావలసిన పదార్థాలు :
పచ్చిమిర్చి... ఎనిమిది
కొత్తిమీర... ఒక కట్ట
ఉప్పు... తగినంత
ఉల్లిపాయలు... మూడు కప్పులు
మంచి నూనె... 150 గ్రాములు
కారం... నాలుగు స్పూన్లు
ఉప్పు చేప... అరకేజీ
తయారీ విధానం :
ఒక బాణలిలో నూనె పోసి అందులో ఉల్లిపాయలు, పచ్చి మిర్చి తరుగుల్ని వేసి బాగా వేయించాలి. అవివేగాక అందులో ఉప్పు చేపలను వేసి వేయించండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా అవి వేగిన తరువాత కాస్తంత ఉప్పు, కారం చేర్చి చేపలు ఉడేకే మోతాదు నీటిని చేర్చి ఉడికించండి. చేపలు ఉడికాక అందులో కొత్తిమీర తరుగును చేర్చి దింపేయండి. అంతే ఉప్పుచేప కూర రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది.