Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మటన్‌తో కట్‌లెట్స్ ఎలా చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు: మటన్ - 1 కిలో పచ్చిమిర్చి - 10 ఉల్లిపాయలు - 200 గ్రాములు కోడిగుడ్లు - 2 నూనె - 200 గ్రాములు అల్లం - చిన్న ముక్క బంగాళాదుంపలు - అరకిలో మిరియాలపొడి - 1 స్పూన్ ఉప్పు - సరిపడా తయారీ వి

Advertiesment
మటన్‌తో కట్‌లెట్స్ ఎలా చేయాలో చూద్దాం...
, శుక్రవారం, 17 ఆగస్టు 2018 (14:05 IST)
కావలసిన పదార్థాలు:
మటన్ - 1 కిలో
పచ్చిమిర్చి - 10
ఉల్లిపాయలు - 200 గ్రాములు
కోడిగుడ్లు - 2
నూనె - 200 గ్రాములు
అల్లం - చిన్న ముక్క
బంగాళాదుంపలు - అరకిలో
మిరియాలపొడి - 1 స్పూన్
ఉప్పు - సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా మాంసాన్ని కైమాలా కొట్టించాలి. తరువాత బంగాళాదుంపలను ఉడికించుకుని పై పొట్టును తీసుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లి, పచ్చిమిర్చి, అల్లాన్ని సన్నగా కట్ చేసుకోవాలి. బాణలిలో నూనెను పోసి వేడయ్యాక పైన కట్ చేసిన వాటిని వేసుకుని బాగా వేయించుకోవాలి.

ఆ తరువాత మటన్ కైమా, బంగాళాదుంప ముద్దను వేసి మరికొంతసేపు వేయించుకోవాలి. చివరగా ఆ మిశ్రమంలో ఉప్పు, మిరియాల పొడిని కలుపుకుని దింపేయాలి. ఈ మిశ్రమాన్ని పూరీల ఉండలుగా చేసుకుని నూనెలో ఎర్రని రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంతే... వేడివేడి మటన్ కల్‌లెట్స్ రెడీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మల్లి ఆకులను మెత్తగా పేస్టులా చేసి అక్కడ రాసుకుంటే?