Publish Date: Mon, 22 Dec 2014 (16:48 IST)
Updated Date: Mon, 22 Dec 2014 (17:03 IST)
వింటర్లో కోడిగుడ్డుతో ఒకేలాంటి కూరలే కాకుండా.. వడలుగా ట్రై చేయండి. ఇవి హైజినిక్ కావడంతో పాటు టేస్టీగానూ ఉంటాయి. ఎలా తయారు చేయాలంటే..
కావలసిన పదార్థాలు :
ఉడికించిన కోడిగుడ్లు - ఎనిమిది
ఉల్లిపాయలు - నాలుగు
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి తరుగు - పావు కప్పు
మినపప్పు - అరకిలో
జీలకర్ర - సరిపడా
తయారీ విధానం:
సుమారు నాలుగు గంటలకు ముందు మినపప్పు నానబెట్టాలి. ఉల్లిపాయలు మిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి వుంచుకోవాలి. నానబెట్టి మినప్పప్పును పిండిగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక అందులో జీలకర్ర వేసి బాగా కలపాలి. ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని వదులుగా చేసుకోవాలి. వడలు బాగా వేగిన తర్వాత తీసేయాలి. ఇవి తినటానికి చాలా రుచిగా ఉంటాయి.