Publish Date: Tue, 10 Mar 2015 (17:50 IST)
Updated Date: Tue, 10 Mar 2015 (17:52 IST)
చికెన్ అంటే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. అదీ ఫ్రైడ్ ఐటమ్స్ అంటే లొట్టలేసుకుని తింటారు. అలాంటి వాటిల్లో కూర్గ్ ఫ్రైడ్ చికెన్ ఒకటి.. దీనని ఇంట్లోనే ట్రై చేయాలంటే.. ?
కావలసిన పదార్థాలు:
చికెన్ - 150 గ్రాములు
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
వెల్లుల్లి, అల్లం పేస్ట్ - పావు కప్పు
కూర్గ్ వెనిగర్ - కాసింత
కారం, ఉప్పు, నూనె - తగినంత
ధనియాల పొడి - ఒక టీ స్పూన్
మిరియాల పొడి - అర టీ స్పూన్
దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు, లవంగాలు - వేపుడుకు తగినంత
తయారీ విధానం :
ముందుగా లవంగాలు వంటి గరంమసాలా పదార్థాలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి. చికెన్‌లో ఉప్పు, మసాలా కలిపి అరగంటపాటు నానబెట్టాలి.
మరో పాన్‌లో నూనె వేడిచేసి వెల్లుల్లి, ఉల్లి వేసి వేయించాలి. గరం మసాలా, కారం కలపాలి. మూడొంతులు ఉడికాక వెనిగర్ వేసి పొడిగా అయ్యేవరకు ఉడికించాలి. అంతే కూర్గ్ ఫ్రైడ్ చికెన్ రెడీ.