Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియమైన జడ్జి కర్ణన్‌... మీకు మతిపోయింది... హైకోర్టు జడ్జికి రాం జెఠ్మలానీ లేఖ

కోల్‌కతా హైకోర్టు జడ్జి కర్ణన్‌కు ప్రముఖ సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ ఓ బహిరంగ లేఖ రాశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు.. దేశ న్యాయ వ్యవస్థపైనే సంచలన ఆరోపణలు చేసిన... జస్టీస్ కర్ణన్‌కు సుప్రీంక

Advertiesment
Ram Jethmalani
, సోమవారం, 13 మార్చి 2017 (11:48 IST)
కోల్‌కతా హైకోర్టు జడ్జి కర్ణన్‌కు ప్రముఖ సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ ఓ బహిరంగ లేఖ రాశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు.. దేశ న్యాయ వ్యవస్థపైనే సంచలన ఆరోపణలు చేసిన... జస్టీస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టు ధర్మాసనం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. తనపై వారెంటు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దళితుడిని కావడంవల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారని జస్టిస్‌ కర్ణన్‌ చేసిన వ్యాఖ్యలపై రాంజెఠ్మలాని బహిరంగ లేఖ రాశారు. 
 
'ప్రియమైన జడ్జి కర్ణన్‌.. నేను మిమ్మల్ని ఇంతకుముందు కలవలేదు. మీ గురించి వినను కూడా వినలేదు. ఇలా చెప్తున్నందుకు క్షంతవ్యుణ్ని... మీకు మతిపోయిందని నేను నమ్ముతున్నాను. బార్‌లో ఒక సీనియర్‌ సభ్యుడిగా.. మీకొక సలహా ఇస్తున్నా. అదేంటంటే.. ఇన్నాళ్లుగా మీరు చేసిన ప్రతి తెలివితక్కువ పనికీ వినయంగా క్షమాపణ వేడుకోండి. మీ ఉన్మాదం ఎంత భారీ స్థాయిలో ఉందో మీకు తెలియకపోతే దయచేసి నన్ను కలవండి. నేను మీకు అర్థమయ్యేలా చెప్తా. ఈ వృద్ధుడి వివేకవంతమైన సలహాని దయచేసి వినండి' అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెరంబలూరు మాంత్రికుడి ఇంట్లో వందల సంఖ్యలో పుర్రెలు.. ఆ శవం శ్మశానం నుంచి తవ్వి తీశారు..