Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెరంబలూరు మాంత్రికుడి ఇంట్లో వందల సంఖ్యలో పుర్రెలు.. ఆ శవం శ్మశానం నుంచి తవ్వి తీశారు..

పెరంబలూరు మాంత్రికుడి కేసులో మరిన్ని నిజాలు బయటికి వచ్చాయి. మహిళ శవాన్ని ఇంట్లో దాచిపెట్టుకుని మంత్రాలతో క్షుద్రపూజలకు పాల్పడిన కార్తికేయన్ అనే మాంత్రికుడ్ని గత శనివారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తె

పెరంబలూరు మాంత్రికుడి ఇంట్లో వందల సంఖ్యలో పుర్రెలు.. ఆ శవం శ్మశానం నుంచి తవ్వి తీశారు..
, సోమవారం, 13 మార్చి 2017 (11:37 IST)
పెరంబలూరు మాంత్రికుడి కేసులో మరిన్ని నిజాలు బయటికి వచ్చాయి. మహిళ శవాన్ని ఇంట్లో దాచిపెట్టుకుని మంత్రాలతో క్షుద్రపూజలకు పాల్పడిన కార్తికేయన్ అనే మాంత్రికుడ్ని గత శనివారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతనితో పాటు అతని భార్య నసీమా భాను (21)ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
 
ఈ కేసులో పోలీసులు ఓ మహిళ శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ శవాన్ని చెన్నై నడిబొడ్డున ఉన్న శ్మశాన వాటిక నుంచి తవ్వి తీసుకెళ్లినట్లు పోలీసులు కనిపెట్టారు. చెన్నై నగరానికి చెందిన ఓ బ్రోకర్‌ నుంచి రూ.20 వేలకు శవాన్ని కొనుగోలు చేసినట్లు కార్తికేయన్ చెప్పాడు. ఇందులో భాగంగా మైలాపూర్ శ్మశానంలో తవ్వకపు పనులు చేస్తున్న ధనరాజ్, సతీష్‌, కార్తీక్‌ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. శవాన్ని అమ్మిన బ్రోకర్‌ వినోద్‌కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ క్రమంలో పెరంబలూరు మాంత్రికుడికి విక్రయించిన శవం చెన్నై తేనాంపేటకు చెందిన అభిరామి (20) అనే యువతిదిగా తెలిసింది. గత జనవరి 18న ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా, అభిరామి మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం జరిపిన తర్వాత బంధువులు శవాన్ని మైలాపూరు శ్మశానంలో ఖననం చేశారు. ఇంకా పెరంబలూరు మాంత్రికుడి ఇంట్లో వందల సంఖ్యలో పుర్రెలు కూడా లభించడంతో అవి ఏయే శ్మశానాల నుంచి తరలించారనే దానిపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శోభా చనిపోయిన ఆస్పత్రిలోనే : నెత్తుటి నేలలో నీళ్లు పారాలని.. కత్తులు వీడి కలిసి ఉండాలని.. (Bhuma Video)