Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యోగా ఓ ఒక్కరికో చెందినది కాదు.. ప్రధాని మోడీ

Advertiesment
narendramodi
, మంగళవారం, 21 జూన్ 2022 (08:28 IST)
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మైసూరులో జరిగిన యోగా వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అక్కడ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగా ఏ ఒక్కరికో చెందినది కాదు.. అందరిదన్నారు. యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడుతుందని చెప్పారు. 
 
'భారత ప్రత్యేకతను, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింభిస్తుంది. కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. యోగా దినోత్సవం.. ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచిక. ప్రస్తుతం యోగా ప్రపంచం నలుమూలలా విస్తరించింది. కరోనా విపత్తు సమయంలోనూ దీన్ని నిర్వహించాం. 
 
సమాజంలో శాంతి నెలకొల్పి సమస్యల పరిష్కారానికి యోగా దోహదం చేస్తుంది.. జీవన విధానానికి మార్గంగా నిలుస్తుంది. ఇది వ్యక్తికే పరిమితం కాదు.. సకల మానవాళికి ఉపయుక్తమైనది. యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలి' అని మోడీ ఆకాంక్షించారు. కాగా, యోగాను గుర్తించిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) సహా ప్రపంచ దేశాలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం - మైసూరులో ప్రధాని యోగాసనాలు