Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వార్తాపత్రికల్లో చుట్టబడిన వేడి వేడి సమోసాలు, జిలేబీలు లాగిస్తున్నారా?

Samosa

సెల్వి

, గురువారం, 12 డిశెంబరు 2024 (20:44 IST)
Samosa
వార్తాపత్రికలలో ప్యాక్ చేసిన ఆహారాన్ని అప్పుడప్పుడు తీసుకోవడం చేస్తుంటాం. ప్రత్యేకించి వేడి వేడి సమోసాలు లేదా జిలేబీలను న్యూస్ పేపర్లలో ప్యాక్ చేసి తెచ్చుకుని లాగిస్తుంటాం. వార్తాపత్రికలలో ఆహారాన్ని చుట్టడం, నిల్వ చేయడం, తినడం మామూలే. అయితే వార్తాపత్రికలలో ఉపయోగించే సిరా ప్రతికూల ఆరోగ్య ప్రభావాలతో వివిధ బయోయాక్టివ్ పదార్థాలను కలిగి ఉంటుంది. ఇది ఆహారాన్ని కలుషితం చేస్తుంది. న్యూస్ పేపర్లలో వుంచిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. 
 
అదనంగా, ప్రింటింగ్ ఇంక్‌లలో సీసం, హెవీ మెటల్స్‌తో సహా రసాయనాలు పేపర్లలో ఉండవచ్చు. ఇవి ఆహారంలో చేరి, కాలక్రమేణా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నుండి ఇటీవలి నివేదికలో తెలిపింది.
 
అంతేకాకుండా, పంపిణీ సమయంలో వార్తాపత్రికలు తరచుగా వివిధ పర్యావరణ పరిస్థితులకు లోబడి ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లు లేదా ఇతర వ్యాధికారక క్రిముల ద్వారా కలుషితమయ్యే అవకాశం ఉంది. వీటిలో ఆహారం తీసుకుంటే.. అనారోగ్యాలకు కారణమవుతాయని FSSAI తెలిపింది. 
 
ఆహార భద్రత- ప్రమాణాల (ప్యాకేజింగ్) నిబంధనలు, 2018ని FSSAI నోటిఫై చేసింది. ఇది ఆహారాన్ని నిల్వ యడానికి, చుట్టడానికి వార్తాపత్రికలు లేదా సారూప్య పదార్థాలను ఉపయోగించడాన్ని ఖచ్చితంగా నిషేధిస్తుంది. 
webdunia
Jilebi
 
ఈ నిబంధన ప్రకారం, వార్తాపత్రికలు ఆహారాన్ని చుట్టడానికి, కవర్ చేయడానికి లేదా వడ్డించడానికి లేదా వేయించిన ఆహారం నుండి అదనపు నూనెను పీల్చుకోవడానికి ఉపయోగించకూడదు. వార్తాపత్రికలకు బదులుగా, అటువంటి సంస్థలు వినియోగదారుల భద్రత- శ్రేయస్సును నిర్ధారించడానికి సిఫార్సు చేయబడిన సురక్షితమైన ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఫుడ్-గ్రేడ్ కంటైనర్‌లను స్వీకరించడాన్ని అన్వేషించాలని FSSAI తెలిపింది.
 
రెగ్యులేటరీ అధికారులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విక్రేతలకు అవగాహన కల్పించాలని, ఆహారాన్ని ప్యాక్ చేయడానికి వార్తాపత్రికలను ఉపయోగించే పద్ధతిని అరికట్టాలని కోరుతూ లేఖలు కూడా రాశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

PMAY-U 2.0 కింద ఇంటిని సరసమైనదిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్