రక్తదానం గురించి అవగాహన కల్పించడానికి #PledgeToDonate ప్రచారాన్ని ప్రారంభించినట్లు భారత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ షేర్‌చాట్ ప్రకటించింది. ఈ ప్రచారం తన ఉద్యోగులతో పాటు 60 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులను రక్తదానం చేసే కార్యక్రమాలతో ప్రతిజ్ఞ చేయడానికి, నిమగ్నం చేయడానికి, భారతదేశం యొక్క రక్త కొరత సమస్యను పరిష్కరించడానికి ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
మెడికల్ జర్నల్ ది లాన్సెంట్ నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం, భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత భారీగా రక్త కొరత ఉంది. అన్ని రాష్ట్రాలు కలిసి 41 మిలియన్ యూనిట్ల భారీ రక్తం కొరతతో పోరాడుతున్నాయి, ఐతే సరఫరాను 400% పైగా అధిగమించాయి.
2020 జూన్ 11 నుండి ప్రారంభమయ్యే 4 రోజుల ప్రచారం రక్తదానం చేయడం ద్వారా దాని వినియోగదారులకు దేశం పట్ల తమ భావాన్ని, బాధ్యతను ప్రదర్శించడంపై దృష్టి పెట్టనుంది. సెల్ఫీ క్యాంపెయిన్‌తో రక్తదానం ప్లాట్‌ఫాంపై సానుకూలతను పంచుకోవడానికి ఇది వినియోగదారులను ఆహ్వానిస్తుంది.
ఈ సందర్భంగా షేర్‌చాట్ సీఓఒ ఫరీద్ అహ్సాన్ మాట్లాడుతూ, “మేము, భారతీయ వినియోగదారుల కోసం రూపొందించిన ఒక భారతీయ వేదిక కాబట్టి, మన దేశం కోసం నిలబడటం మా నైతిక బాధ్యత. #PledgeToDonate ప్రచారంతో,“చెందినది” అనే ఆలోచనను ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. రక్తం దానం చేస్తామని ప్రతిజ్ఞ తీసుకొని లక్షలాది మంది భారతీయులు ముందుకు వచ్చి దేశానికి తోడ్పడటానికి ఈ ప్రచారం ప్రేరేపిస్తుందని మేము ఆశిస్తున్నాము. ప్రస్తుత కాలంలో చాలా ప్రాముఖ్యత ఉన్న వివిధ భద్రతా చర్యలపై మేము ప్రజలకు అవగాహన కల్పిస్తాము.”
"ఇది మా వైద్య మౌలిక సదుపాయాలకు, ముఖ్యంగా మహమ్మారి పరిస్థితులకు అపారమైన సహాయాన్ని అందిస్తుందని మేము నమ్ముతున్నాము. ఈ ప్రచారం విజయవంతమవుతుందని, భవిష్యత్తు వైపు దూసుకెళ్లేందుకు దేశానికి సహాయపడుతుందని మాకు నమ్మకం ఉంది” అన్నారాయన
షేర్‌చాట్ ప్లాట్‌ఫామ్‌లోని వెబ్‌కార్డ్‌ను ‘ప్రతిజ్ఞ’ బటన్‌తో యాక్టివేట్ చేసింది. బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా ప్రతిజ్ఞ చేయమని వినియోగదారులను కోరుతుంది. యూజర్లు జూన్ 13 నుండి సెల్ఫీలతో ఫాలో అప్ క్యాంపెయిన్ #IHavePledgedలో చేరాలని భావిస్తున్నాం. షేర్‌చాట్ చిట్కాలు, సలహాలు వాస్తవాలతో దాని వినియోగదారులలో అవగాహనను పెంచుతుంది. షేర్‌చాట్‌లో 15 భారతీయ భాషల్లో ఈ ప్రచారం సక్రియం చేయబడుతుంది.