గర్భానికి తండ్రే కారణం.. మైనర్ బాలిక గర్భస్రావానికి అనుమతి.. వైద్యుల సలహాతో?
హర్యానాలో పదేళ్ల మైనర్ గర్భస్రావానికి అనుమతి లభించినట్లు వార్తలు వస్తున్నాయి. రోహ్‌టక్‌కు చెందిన మైనర్ బాలిక తన పెంపుడు తండ్రిచే అత్యాచారానికి గురైంది. అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి చిన్నారిని తీసుకెళ్
హర్యానాలో పదేళ్ల మైనర్ గర్భస్రావానికి అనుమతి లభించినట్లు వార్తలు వస్తున్నాయి. రోహ్‌టక్‌కు చెందిన మైనర్ బాలిక తన పెంపుడు తండ్రిచే అత్యాచారానికి గురైంది. అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి చిన్నారిని తీసుకెళ్లిన ఆ తల్లికి వైద్యులు షాకిచ్చారు. చిన్నారి గర్భంగా ఉందని తేల్చారు. దీంతో మైనర్ బాలిక వద్ద జరిపిన విచారణలో తాను అత్యాచారానికి గురైనట్లు తెలిసింది.
తన గర్భానికి కారణం పెంపుడు తండ్రేనని వెల్లడించింది. ఈ విషయాన్ని బయటికి చెప్తే.. చంపేస్తానని బెదిరించడంతో మైనర్ బాలిక ఈ వ్యవహారాన్ని దాచేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఇంకా మైనర్ బాలిక అబార్షన్‌కు అనుమతి ఇవ్వాలని బాధితురాలి తల్లితో పాటు బంధువులు రోహ్‌టక్ కోర్టును ఆశ్రయించారు. ఇందుకు కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. వైద్యుల సలహా మేరకు ఆ బాలికకు గర్భస్రావానికి అనుమతి ఇవ్వాలని సిఫార్సు చేసింది.