Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్ అణ్వాయుధాలను అక్కడ భద్రంగా దాచేస్తోంది... భారత్‌కు గండమేనా?

పాకిస్థాన్ అణ్వాయుధాలను ఖైబర్ పష్తూన్‌క్వా సమీపంలోని పీర్ థాన్ పర్వతం దగ్గర దాస్తోందని మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. ఉపగ్రహం ద్వారా మిలిటరీ ఇంటెలిజెన్స్ సేకరించిన సమాచారం ప్రకారం పీర్

పాకిస్థాన్ అణ్వాయుధాలను అక్కడ భద్రంగా దాచేస్తోంది... భారత్‌కు గండమేనా?
, గురువారం, 18 మే 2017 (15:05 IST)
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఖైబర్ పష్తూన్‌క్వా సమీపంలోని పీర్ థాన్ పర్వతం దగ్గర దాస్తోందని మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. ఉపగ్రహం ద్వారా మిలిటరీ ఇంటెలిజెన్స్ సేకరించిన సమాచారం ప్రకారం పీర్ థాన్ పర్వతం దగ్గర షహీన్-3 బ్యాలిస్టిక్ మిసైల్స్‌ను రహస్యంగా మోహరించి వుండవచ్చునని తెలుస్తోంది. అణ్వాయుధాలను ప్రయోగించాల్సిన సామర్థ్యం ఈ క్షిపణులకు ఉంది. 
 
ఇలా పాకిస్థాన్ అణ్వాయుధాలను నిల్వ చేయడం భారత్‌కు ఆందోళనకరమేనని విశ్లేషకులు అంటున్నారు. అణ్వాయుధాలు దాచిన పీర్ థాన్ పర్వత ప్రాంతం భారతదేశంలోని అమృత్‌సర్‌కు 320 కి.మీ. దూరంలోనూ, చండీగఢ్‌కు 520 కి.మీ. దూరంలోనూ, న్యూఢిల్లీకి 720 కి.మీ. దూరంలోనూ ఉంది. అణ్వాయుధాలను ప్రయోగించేందుకు అనువైన ఈ మిసైల్స్ 2,750 కి.మీ. దూరంలోని లక్ష్యాలను సమర్థంగా ఛేదించగలవని మిలటరీ వర్గాలు తెలిపాయి. దీంతో భారత్‌కు పాకిస్థాన్‌తో గండం తప్పదని విశ్లేషకులు హెచ్చరించింది. 
 
ఇప్పటికే సరిహద్దుల వల్ల కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ.. భారత సైనికులపై ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్‌కు అణ్వాయుధాలు తోడైతే పరిస్థితి ఏవిధంగా ఉంటుందనేది అర్థం చేసుకోవాల్సి వుందని.. కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని మిలటరీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోదరిని ఏడిపించారు.. కత్తితో దాడి చేశారని.. మైనర్ ఆ ఇద్దరిని చంపేశాడు..