కోడలి వేధింపులు.. భర్తతో పాటు అత్తామామల ఆత్మహత్య.. ఎక్కడ?
కోడలి వేధింపుల కారణంగా.. భర్తతో పాటు అత్తమామలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. పంజాబ్, జలంధర్ నగర్, కిషన్‌పురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కిషన్ పురానికి చెందిన రామన్ (3
Publish Date: Tue, 05 Jul 2016 (14:43 IST)
Updated Date: Tue, 05 Jul 2016 (14:50 IST)
కోడలి వేధింపుల కారణంగా.. భర్తతో పాటు అత్తమామలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. పంజాబ్, జలంధర్ నగర్, కిషన్‌పురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కిషన్ పురానికి చెందిన రామన్ (30) భార్య మోనిక, ఆతని తల్లిదండ్రులను చిత్రహింసలు పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న రామన్.. తన తల్లిదండ్రులతో పాటు రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ ముగ్గురు మృతదేహాలను రామ్ నగర్ రైల్వే స్టేషన్ వద్ద కనుగొన్న పోలీసులు.. పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామన్ భార్య వద్ద విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో రామన్ ఎనిమిదేళ్ల క్రితం మోనికను పెళ్లాడినట్లు తెలిసింది. గత రెండేళ్లుగా భర్తతో పాటు.. అత్తమామలను మోనిక హింసించడంతో మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. రామన్ వెల్డింగ్ షాపు నడుపుతున్నాడని వారు తెలిపారు.