Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23 ఏళ్ల మహిళపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. గాయంపై కారం పొడిని..?

Advertiesment
rape

సెల్వి

, శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (15:47 IST)
మధ్యప్రదేశ్‌లోని గుణాలో 23 ఏళ్ల మహిళపై ఆమె పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితులు తనను ఒక నెలపాటు బలవంతంగా బందీగా ఉంచి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు పేర్కొంది.
 
వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, బాధితురాలి తల్లి పేరు మీద నమోదైన ఆస్తిపై నిందితుడికి కన్ను ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడు తనను పెళ్లి చేసుకోమని బలవంతపెట్టాడని, తన తల్లిదండ్రుల ఆస్తిని తన పేరు మీదకి మార్చుకున్నాడని బాధితురాలు పేర్కొంది.
 
నెల రోజుల పాటు తన నివాసానికి తీసుకెళ్లి గదిలోకి బంధించాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి, బెల్టులు, నీటి పైపులతో పదే పదే కొట్టేవాడు.
 
 అలాగే  దాడి కారణంగా ఏర్పడిన తన గాయాలపై కారం పొడిని పూసాడని, ఆమె కేకలు వేయకుండా ఉండేందుకు తన పెదవులను జిగురుతో మూసివేశాడని బాధితురాలు పేర్కొంది.
 
అయితే, నెలకు తర్వాత ఎలాగోలా ఇంటి నుంచి తప్పించుకుని కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఆమె పెదవులు జిగురుతో మూసేయడం, ఆమె కళ్లు ఉబ్బడం, ఆమె శరీరం కొట్టిన సంకేతాలు కనిపించడం వల్ల ఆమె పదే పదే దాడికి గురైందని పోలీసులు నిర్ధారించారు. 
 
ఇకపోతే బాధిత మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (అత్యాచారం), 294 (అసభ్య పదజాలం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపాకు ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే : వైఎస్ షర్మిల