Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరునల్వేలిలో ఎలుగుబంటి.. జనాలకు చుక్కలు

Bear

సెల్వి

, గురువారం, 11 ఏప్రియల్ 2024 (14:19 IST)
Bear
తమిళనాడు, తిరునెల్వేలి జిల్లా అంబాసముద్రం ప్రాంతంలో పులి, చిరుత, ఏనుగు, ఎలుగుబంటి వన్యప్రాణాలు వున్నాయి. ఈ వన్యప్రాణులు వన ప్రాంతం నుంచి అప్పుడప్పుడు జన సంచారం వున్న ప్రాంతాల్లోకి వచ్చి జనాలను జడుసుకునేలా చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అంబాసముద్రానికి సమీపంలో కల్లిడైకురిచ్చి ప్రాంతంలో ఓ ఎలుగుబంటి ప్రవేశించింది. ఆ ఎలుగుబంటి కల్లిడైకురిచ్చి ప్రాంతానికి చెందిన ప్రజలకు చుక్కలు చూపించింది. ఎక్కడ జనాలు కనిపించినా.. తరుముకుంది. 
 
ఇంకా ప్రజలు కూడా ఆ ఎలుగుబంటిపై దాడి చేసేందుకు తిరగబడ్డారు. అయితే ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనపై అంబాసముద్రం అటవీశాఖాధికారులు ఎలుగుబంటి కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంజాన్ 2024.. మిలియన్ ప్లేట్ల బిర్యానీ- స్విగ్గీలో ఆర్డర్ చేసిన హైదరాబాదీస్