Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తుపాకీతో బెదిరించి మహిళపై గ్యాంగ్ రేప్

Advertiesment
తుపాకీతో బెదిరించి మహిళపై గ్యాంగ్ రేప్
, గురువారం, 30 జులై 2020 (18:44 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్పూర్‌లో దారుణం జరిగింది. ఓ మహిళపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తుపాకీతో బెదిరించి ఈ ఘాతుక చర్యకు పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్పూర్ పట్టణంలోని సైపావు ప్రాంతానికి చెందిన 27 యేళ్ళ ఓ మహిళను కొందరు యువకులు తుపాకీతో బెదిరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక లైంగిక దాడి చేశారు. 
 
ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకుని వచ్చిన బాధితురాలు... పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన కామాంధులు పారిపోగా, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా రక్కసికి మంగళం... రష్యా వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. ఆగస్టు 10కల్లా సిద్ధం..!