Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేధింపులు భరించలేక అత్తను రాడ్డుతో కొట్టి చంపిన కోడలు... ఎక్కడ?

Advertiesment
Maharashtra
, సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (11:16 IST)
కట్టుకున్న భర్త పెట్టే వేధింపుల కంటే.. అత్త వైపు నుంచి ఎదురవుతున్న వేధింపులను భరించలేకని ఓ కోడలు.. ఘాతుకానికి ఒడిగట్టింది. అత్తను ఇనుపరాడ్డుతో కొట్టి చంపేసింది. ఆ తర్వాత పక్కింటి బాత్రూమ్‌లోకి దూరి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌ జిల్లాలో జరిగింది.
 
ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాయ్‌గడ్‌ జిల్లాకు చెందిన యోగిత(32) అనే మహిళ భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడు. ఆమె తన ఇద్దరు పిల్లలతో అత్తారింట్లోనే ఉంటోంది. తరచూ అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 
 
ఈ క్రమంలో గత శుక్రవారం కూడా ఇద్దరికీ గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన యోగిత, అత్త తారాబాయ్‌ని ఇనుప రాడ్డుతో కొట్టి చంపింది. మామ, ఇద్దరు పిల్లల కళ్ల ముందే ఈ దారుణానికి పాల్పడింది. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అరెస్టు చేస్తారని భయపడిన యోగిత పక్కింటి బాత్‌రూంలోకి దూరి తలుపేసుకుంది. అనంతరం టాయిలెట్‌ క్లీనర్‌ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. 
 
పోలీసులు బాత్‌ రూం తలుపులు బద్దలుకొట్టిచూడగా.. ఆపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు ఆసుపత్రినుంచి విడుదలైన వెంటనే అరెస్టు చేస్తామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్రలో కోవిడ్ అప్.. 55మందికి కరోనా.. ఆలయం మూసివేత