అమ్మ అంగీకారంతో అట్టహాసంగా అన్నాడీఎంకే వార్షికోత్సవాలు.. జయ గ్రీన్ సిగ్నల్...
తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గత నెల 22న అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని వైద్యులు వెల్లడిం
తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గత నెల 22న అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని వైద్యులు వెల్లడించగానే అన్నాడీఎంకే కార్యకర్తలు పండగ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.
అమ్మ ఆరోగ్యం కోసం హోమాలు, పూజలు చేసిన అన్నాడీఎంకే కార్యకర్తలు, ప్రజలు, శ్రేయోభిలాషులందరికీ.. ఆమె కోలుకుంటుందన్న వార్త బూస్టునిచ్చింది. మూడు వారాలుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంతుతున్న ఆమె ఆరోగ్యానికి ఢోకా లేదన్న వార్తల నేపథ్యంలో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 17న పార్టీ 44వ వార్షికోత్సవాన్ని జయలలిత అంగీకారంతో నిర్వహించేందుకు ఏఐఏడీఎంకే నిర్ణయించింది.
పార్టీ 44 నుంచి 45వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 17న పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నట్టు పార్టీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రకటన విడుదల చేసేందుకు జయలలిత కూడా అంగీకారం తెలిపినట్లు అన్నాడీఎంకే పార్టీ వెల్లడించింది. ఈ వార్షికోత్సవ వేడుకలు అమ్మ అంగీకారంతో అట్టహాసంగా జరుగనున్నాయి.