Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళల్ని పిచ్చపిచ్చగా వాడుకుంటాం.. నా చెల్లి 16 ఏళ్ల వయస్సులో 7 పురుషుల్ని పెళ్లాడింది!

ఉగ్రవాదులు మహిళల పట్ల క్రూరంగానే ప్రవర్తిస్తారు. తాజాగా ఉగ్రవాదులు మహిళలను బానిసలుగా, సెక్స్ వర్కర్లుగా చూస్తారని ఓ ఇంటర్వ్యూ తేల్చింది. తల్లి అయినా, చెల్లి అయినా, కట్టుకున్న భార్య అయినా పట్టించుకోను.

Advertiesment
మహిళల్ని పిచ్చపిచ్చగా వాడుకుంటాం.. నా చెల్లి 16 ఏళ్ల వయస్సులో 7 పురుషుల్ని పెళ్లాడింది!
, శుక్రవారం, 14 అక్టోబరు 2016 (18:32 IST)
ఉగ్రవాదం అనేది దారుణాలకు, విధ్వంసాలకు మారుపేరు. వారు క్రూరానికి పెట్టింది పేరు. అలాంటి ఉగ్రవాదంలో ఉగ్రమూకలుగా తిరగాడేవారికి మహిళలపై దయాగుణం ఎక్కడుంటుంది. ప్రజల మధ్య ఉండే  కామాంధులే మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతుంటే.. కిరాతకంగా వ్యవహరించే ఉగ్రవాదులు మహిళల పట్ల క్రూరంగానే ప్రవర్తిస్తారు. తాజాగా ఉగ్రవాదులు మహిళలను బానిసలుగా, సెక్స్ వర్కర్లుగా చూస్తారని ఓ ఇంటర్వ్యూ తేల్చింది. 
 
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిగా ఉంటూ, స్లీపర్ సెల్స్‌ను నియమించేందుకు వెళ్లిన ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు నాలుగు నెలల క్రితం అరెస్ట్ చేశారు. అంతేగాకుండా.. అతడి వద్ద ఇంటర్వ్యూ చేసిన వివరాలను వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. కట్టుకున్న భార్యైనా, కన్నతల్లైనా, తోడబుట్టిన చెల్లైనా.. ఇస్లామిక్ చట్టం ప్రకారం లైంగిక  బానిసలుగా పడివుండాల్సిందేనని.. ఇస్లామిక్ చట్టం కూడా ఇదే చెప్తుందన్నాడు ఆ ఉగ్రవాది. 
 
తన భార్య ఎప్పుడూ బురఖా ధరిస్తుందని, తాను లేకుండా బయటకు వెళ్లడం నిషేధమని ఆ ఉగ్రవాది చెప్పాడు. తాను అరెస్టయిన నేపథ్యంలో.. ఆమెను ఇంకెవరైనా వివాహం చేసుకోవచ్చు. అసలు ఆమె ఉన్నదే పిల్లల్ని కనడానికేనని ఆ క్రూరుడు చెప్పుకొచ్చాడు. జీహాద్ ప్రపంచంలో స్త్రీకి స్వీయ ఇష్టాలు ఉండవని, వారు ప్రాణాలతో మాత్రమే ఉంటారని, నచ్చినట్టు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశాడు. తన సోదరి 16 ఏళ్ల వయస్సులో ఏడుగురు పురుషుల్ని పెళ్ళాడిందని ఆ ఉగ్రవాది షాక్ ఇచ్చే నిజాలను చెప్పుకొచ్చాడు.
 
ఇందులో తల్లి అయినా, చెల్లి అయినా, కట్టుకున్న భార్య అయినా పట్టించుకోను. ఆడవాళ్లు దిగువ స్థాయి వారే. జీహాదీ ప్రపంచంలో యాజిడి మహిళలు విలువైన లైంగిక బానిసలని, వారంతా ఇస్లామిక్ స్టేట్ పెద్దల కోసమే పుట్టారని, వారిని ఎలా కావాలంటే అలా వాడుకుంటామని వెల్లడించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈజిప్టులో సైనికులపై ఉగ్రమూకల దాడి.. 12 మంది మృతి.. 8మందికి గాయాలు..