దేశంలో కరోనా వైరస్ సంక్షోభాన్ని కట్టడిచేయడం కోసం విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ భారీ విరాళాన్ని ప్రకటించారు. విప్రో లిమిటెడ్, విప్రో ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ మరియు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్లతో కలిసి కరోనా సంక్షోభాన్ని పరిష్కరించడం కోసం రూ. 1,125 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. విప్రో లిమిటెడ్ రూ. 100 కోట్లు, విప్రో ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ రూ. 25 కోట్లు, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ. 1000 కోట్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
మరోవైపు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ప్రభుత్వానికి ఆర్థికంగా అండగా నిలుస్తూ కరోనా పట్ల ప్రజల్లో అవగాహన నింపుతున్నారు. సీఎం, పీఎం సహాయ నిధులకు ఆర్థిక సాయం చేయడమే గాక సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటు చేశారు. చిరంజీవి సారథ్యంలో ఏర్పడిన ఈ ఛారిటీకి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు తెలుగు సినీ తారలు.
ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ సహా ఎందరో సినీ హీరోలు ఈ ఛారిటీకి భారీ విరాళాలు అందించగా.. తాజాగా హీరో శ్రీకాంత్ ముందుకొచ్చారు. తన వంతుగా రూ.5 లక్షల విరాళం అందజేశారు. సరైన సమయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకున్న పెద్దలందరికీ ధన్యవాదాలు అని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.