Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశం.. ఉద్రిక్తత.. సగం మీసం తీసేసి?

అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశం.. ఉద్రిక్తత.. సగం మీసం తీసేసి?
, గురువారం, 3 జనవరి 2019 (15:59 IST)
కేరళలోని సుప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయంలో ఇద్దరు మహిళలు ప్రవేశించడంపై అయ్యప్ప భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయ్యప్ప భక్తుల ఆందోళనలతో పాటు.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. ఒక కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి.


ఈ క్రమంలో తిరువనంతపురం ప్రాంతానికి చెందిన రాజేశ్ అనే వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపారు. సగం మీసం తీసేసి వార్తల్లో నిలిచారు. సగం మీసం తీసేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు. 
 
మరోవైపు శబరిమలలో ఇద్దరు మహిళల ప్రవేశంతో కేరళ ప్రభుత్వంపై ఆందోళనకారులు మండిపడుతున్నారు. కేరళతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగా తమిళనాడులోని కేరళ పర్యాటక శాఖకు చెందిన ఓ హోటల్‌పై దుండగులు దాడిచేశారు. ఇక తమిళనాడులోని కేరళ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం 100 మంది అదనపు పోలీసులను నియమించామని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. 
 
అలాగే కేరళ అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుకుగూడలో శ్రీశైలం హైవేపై అయ్యప్ప స్వాములు ఆందోళన చేపట్టారు. తుక్కుగూడలోని అయ్యప్ప స్వామి ఆలయం నుంచి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహిస్తూ నిరసన తెలిపారు. శ్రీశైలం హైవే వద్దకు వచ్చాక అక్కడ ఆందోళన చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ. 2 కే 20 లీటర్ల త్రాగునీరు... రూ. 4కే భోజనం... రోజాకే సాధ్యం...