Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యతో జల్సా చేసిన రాజకీయ నాయకుడు: నగ్న దృశ్యాలను వీడియో తీసిన భర్త.. ఆపై ఏం చేశాడంటే?

వివాహితతో రాసలీలలు జరుపుతున్న ఓ రాజకీయ నాయకుడి బండారం బయటపడింది. భర్తలేని సమయం చూసుకుని వివాహిత ఇంటికెళ్లి.. ఆమెతో పడకను పంచుకున్న రాజకీయ నాయకుడికి తగిన శాస్తి జరిగింది. భార్యపై అనుమానంతో సదరు వివాహిత

Advertiesment
Wife
, శుక్రవారం, 26 మే 2017 (17:00 IST)
వివాహితతో రాసలీలలు జరుపుతున్న ఓ రాజకీయ నాయకుడి బండారం బయటపడింది. భర్తలేని సమయం చూసుకుని వివాహిత ఇంటికెళ్లి.. ఆమెతో పడకను పంచుకున్న రాజకీయ నాయకుడికి తగిన శాస్తి జరిగింది. భార్యపై అనుమానంతో సదరు వివాహిత భర్తే ఆ రాజకీయ నాయకుడితో జల్సా చేసిన తన భార్యను పోలీసులకు అప్పగించాడు.

రాజకీయ నాయకుడితో తన భార్య రాసలీలలు జరిపిన దృశ్యాలను మొబైల్‌లో వీడియో తీశాడు. ఆపై ఇంటికి తాళం వేసి మీడియా, పోలీసులకు తన భార్యతో పాటు రాజకీయ నాయకుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని రాచనగరి మైసూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. టి.నరసీపుర ఏపీఎంపీ సభ్యుడు ప్రభాకర్ కాంగ్రెస్ నాయకుడు. ఇతడిని అవులహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలోని జనతా కాలనీలో నివాసం ఉంటున్న బాధితుడు శివకుమార్ అలియా శివశంకర్ ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

బాధితుడు శివకుమార్ తన భార్యతో కలిసి జనతా కాలనీలో నివాసముంటున్నాడు. ఆమె గ్రామపంచాయితీ సభ్యురాలు. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తోంది. శివకుమార్ భార్య ఈ మధ్య కార్యాలయ పనుల కోసం అప్పుడప్పుడు బయట తిరుగుతున్నట్లు తెలిసింది. పార్టీ కార్యాకలాపాల్లో భాగంగా శివకుమార్ భార్యకు ప్రభాకర్ దగ్గరయ్యాడు. మెల్ల మెల్లగా ఆమెను లొంగదీసుకున్నాడు. ఆమె కూడా ప్రభాకర్ వలలో పడిపోయింది.  
 
ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. శివకుమార్ ఇంట్లో లేని సమయంలో ప్రభాకర్ నేరుగా ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికే వెళ్లేవాడు. ఆమెతో జల్సా చేసేవాడు. అయితే తన భార్య వ్యవహారంపై శివకుమార్‌కు అనుమానం వచ్చింది. విషయం తెలుసుకుని ఇద్దరినీ మందలించినా లాభం లేకపోయింది. దీంతో ఎలాగైనా ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ప్లాన్ వేశాడు.
 
శుక్రవారం ఉదయం శివకుమార్ బయటకు వెళ్లినట్లు నటించాడు. ఆ సమయంలో ప్రభాకర్ నేరుగా శివకుమార్ ఇంటికి వచ్చాడు. పడక గదిలో శివకుమార్ భార్య, ప్రభాకర్ నగ్నంగా ఉన్న దృశ్యాలను మొబైల్‌లో వీడియో తీశాడు. అర్థగంట వీడియో తీసిన పిమ్మట ఇంటికి బయట తాళం వేసి మీడియా, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

పోలీసులు వచ్చిన వెంటనే ఇంటి తాళం తీసి భార్యను, ఆమె ప్రియుడిని రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించాడు. ఈ ప్రభాకర్ ఎవరో కాదు.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితుడైన కేసీ బలరామ్ కుమారుడే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శివకుమార్, అతని భార్యకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్.. జగన్‌ను దూరంగా ఉంచండి.. మనం కలిసే ఉందాం.. ఎవరు...?