Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్.. జగన్‌ను దూరంగా ఉంచండి.. మనం కలిసే ఉందాం.. ఎవరు...?

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన అంశం బీజేపీ, టీడీపీల బంధం ఒక్కటిగానే ఉంటుందా? భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా తాము వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలిసి పోటీ చేస్తామని చెప్ప

Advertiesment
Chandrababu Naidu
, శుక్రవారం, 26 మే 2017 (16:01 IST)
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన అంశం బీజేపీ, టీడీపీల బంధం ఒక్కటిగానే ఉంటుందా? భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా తాము వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం దీనిపై ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. గత ఎన్నికల్లో కూడా బిజెపితో కలిసి పోటీ చేయడం వల్ల చాలా చోట్ల ఓడిపోయామన్నది టిడిపి నేతల వాదన. స్వయంగా నాని ఇదే విషయాన్ని చెప్పాడు. తనకు తక్కువ మెజారిటీ రావడానికి బిజెపినే కారణమని. తెలుగుదేశం పార్టీ సింగిల్‌గా ఉంటే తనకు భారీ మెజారిటీ వచ్చేదని. ఇది ఒక్కటే కాదు ఆయన చెప్పేది. ఇంకా చాలామంది నాయకులు ఇదే అనుకుంటున్నారు.
 
కానీ బిజెపి తెలంగాణాలో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటే, ఏపీలో మాత్రం టిడిపితో కలిసి పనిచేయాలన్నది వారి ఆలోచనే. ఈ విషయాన్ని స్వయంగా అమిత్ షానే ప్రకటించారు. తెలంగాణాలో రెండురోజుల పాటు పర్యటించిన అమిత్ షా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే ఆ తరువాత ఏపీలో పర్యటనకు వచ్చారు. ఏపీ పర్యటనకు ముందు అమిత్ షా, చంద్రబాబులు ఒకే విమానంలో విజయవాడకు వచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య కొన్ని ఆసక్తికర సంభాషణలు జరిగాయట. అదే పొత్తుపై చర్చ. 
 
ఇప్పటికే ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అలాగే కొనసాగిద్దాం సర్.. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని దూరంగా ఉంచండి. ఇప్పటికే ఆయన ప్రధానిని కలిశారు. ఏపీలో బీజేపీతో కలిసి పోటీలో దిగుతామని కొంతమంది వైసిపి నేతలు చెబుతున్నారు. మీరు మాతోనే ఉంటానంటున్నారు. ఖచ్చితంగా మీరు మాతోనే ఉండాలి. జగన్‌తో వద్దు సర్.. ప్లీజ్.. అంటూ చంద్రబాబు అమిత్ షాను కోరారట. అమిత్‌ షా ఏది అనుకుంటే అది జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అమిత్ షా చెబితే ప్రధాని కూడా వింటారు. కాబట్టి ఒక రాయి ఇక్కడ వేశారు బాబు. 
 
అన్నీ విన్న అమిత్ షా అలాగే చేద్దాం బాబు గారు అంటూ భుజం తట్టారట. ఇదంతా విమానంలో జరిగింది. చంద్రబాబు మాత్రం ప్రస్తుతం అమిత్ షా ఇచ్చిన హామీతో ధైర్యంగా ఉన్న ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నదో వేచి చూడాల్సిన పరిస్థితి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో కామపిశాచి.. ఏం చేశాడో తెలుసా..?