Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లలు కోచింగ్ సెంటర్‌కు, భర్త వాకింగ్‌కు, భార్య ప్రియుడితో మార్నింగ్ రొమాన్స్

Advertiesment
wife
, శనివారం, 10 అక్టోబరు 2020 (19:21 IST)
పిల్లలు పెద్దవారయ్యారు. వారికి విద్యాబుద్ధులు బాగా నేర్పించాలి. మనలో ఇంకా మార్పు రావాలి. నువ్వు మారాలి అన్నాడు భర్త. అయితే ఆ భార్యలో మాత్రం మార్పు రాలేదు కదా.. అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. భర్త స్నేహితుడితో సంవత్సరం పాటు రాసలీలల్లో మునిగి తేలి చివరకు ప్రాణాలకు పోగొట్టుకుంది.
 
ఉత్తరప్రదేశ్ లోని బంబేరు పోలీస్టేషన్ పరిధి. చిన్నార్ యాదవ్, విమల దంపతులు. వీరికి భగత్, ప్రహ్లాద్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మరొకరు ఇంటర్ సెకండియర్. కరోనా కావడంతో ఇప్పుడిప్పుడే ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం ప్రతిరోజు పక్కనే ఉన్న స్నేహితుల ఇంటి వద్దకు వెళ్ళేవారు.
 
ప్రతిరోజు ఉదయం భర్త చిన్నార్ యాదవ్ వాకింగ్‌కు వెళ్ళేవాడు. చిన్నార్‌తో పాటు అతని స్నేహితుడు రవికాంత్ కూడా వాకింగ్‌కు వెళ్ళేవాడు. చిన్ననాటి నుంచి రవికాంత్ స్నేహితుడు కావడంతో ఇంట్లో ఎలక్ట్రికల్ పనులు చేసేవాడు. రవికాంత్ ఎలక్ట్రీషియన్. 
 
ఇలా రవికాంత్ మెల్లగా విమలకు దగ్గరయ్యాడు. తీయ తీయటి మాటలు చెపుతూ ఆమెను లొంగదీసుకున్నాడు. భర్త వాకింగ్‌కు వెళ్ళడం, పిల్లలు ఆన్ లైన్ క్లాస్‌లకు వెళ్ళగానే ప్రియుడితో విమల మంచి రసపట్టులో ఉండేది. ఫోన్ చేసి మరీ పిలిపించుకుని ఆ సంబంధాన్ని కొనసాగించింది. 
 
ఈ బంధం కాస్త సంవత్సరం నుంచి సాగుతోంది. అయితే ఇరుగుపొరుగు వారు చెప్పడంతో భర్తకు భార్య బాగోతం తెలిసింది. ఎలాగైనా రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకోవాలనుకున్నాడు. వాకింగ్‌కు వెళుతున్నట్లే వెళ్ళి ఇంటికి దగ్గరలోనే ఉన్నాడు.
 
భార్య ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. శృంగారంలో మునిగిపోయారు. నేరుగా ఇంటికి వచ్చిన చిన్నార్ యాదవ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇంట్లో కట్టెలు కొట్టేందుకు తెచ్చిపెట్టిన గొడ్డలితో భార్య మెడపైన నరికాడు. ఆ తరువాత తన భార్యతో వున్న స్నేహితుడి మర్మాంగాలపై నరికాడు. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. భార్య తలను తీసుకుని నేరుగా పోలీస స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్ భయాందోళనల నుండి చిన్నారుల విముక్తికి టోల్ ఫ్రీ నెంబర్