Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయలలిత ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డును ఎందుకు చంపారంటే...

నీలగిరి జిల్లా కొడనాడులోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డు ఇటీవల హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ హత్యకు కారణాలను పోలీసులు ఛేదిస్తున్నారు. ఆ భవనంలోని జయలలిత గది నుంచి వజ్రవైఢూర్య

జయలలిత ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డును ఎందుకు చంపారంటే...
, బుధవారం, 26 ఏప్రియల్ 2017 (09:49 IST)
నీలగిరి జిల్లా కొడనాడులోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డు ఇటీవల హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ హత్యకు కారణాలను పోలీసులు ఛేదిస్తున్నారు. ఆ భవనంలోని జయలలిత గది నుంచి వజ్రవైఢూర్య, బంగారు ఆభరణాలు, దస్తావేజులు, డబ్బు దోచుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. 
 
పైగా, ఈ దోపిడీ పక్కా వ్యూహంతోనే జరిగిందని పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ ఘటనలో నేపాల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్‌ మృతి చెందగా, మరో గార్డు కృష్ణ బహదూర్‌ తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఐదుగురు డీఎస్పీల నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు పలుకోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాయి. 
 
ఆగంతకులు బంగళాలోకి ప్రవేశించి 3 సూట్‌కేసుల్లో బంగారం, వజ్రవైఢూర్యాలు, కోట్లాది రూపాయల నగదు, ముఖ్యమైన దస్తావేజులను దోచుకెళ్లినట్లు సమాచారం. ఈ దోపిడీ జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సీసీ కెమెరాలు కూడా పనిచేయలేదు. హత్య జరిగిన ప్రాంతానికి కొద్దిదూరంలో గార్డుల సెల్‌ఫోన్లు ధ్వంసమై పడి వున్నాయి. దీంతో దోపిడీ దొంగలు వజ్రవైఢ్యూర్యాలను దోచుకుని వెళ్లివుంటారని పోలీసులు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూమా ఫ్యామిలీకి షాకిచ్చిన చంద్రన్న... మంత్రి పదవికి అఖిల ప్రియా రిజైన్ చేస్తారా?