Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భూమా ఫ్యామిలీకి షాకిచ్చిన చంద్రన్న... మంత్రి పదవికి అఖిల ప్రియా రిజైన్ చేస్తారా?

దివంగత భూమా ఫ్యామిలీకి టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షాకిచ్చినట్టు సమాచారం. ఇటీవల భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ ఏర్పడిన నంద్యాల అసెంబ్లీ సీటు వ్యవహారంలో భూమా ఫ్యామిలీకి, చంద్

Advertiesment
Bhuma Akhila Priya Reddy
, బుధవారం, 26 ఏప్రియల్ 2017 (09:31 IST)
దివంగత భూమా ఫ్యామిలీకి టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షాకిచ్చినట్టు సమాచారం. ఇటీవల భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ ఏర్పడిన నంద్యాల అసెంబ్లీ సీటు వ్యవహారంలో భూమా ఫ్యామిలీకి, చంద్రబాబుకు మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు వినికిడి. 
 
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగి రెడ్డి మరణం తర్వాత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియను టీడీపీ నేత చంద్రబాబు మంత్రిని చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మొదట వైకాపా నుండి పోటీ చేసి గెలిచిన తండ్రీ కూతురు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారారు. 
 
ఆసమయంలో టీడీపీ నుండి బరిలోకి దిగి భూమా చేతిలో ఘోరంగా ఓడిపోయిన శిల్పా మోహన్ రెడ్డి ఈ సారి ఖాళీ అయిన స్థానంలో మళ్లీ టీడీపీ నుండి అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి భూమా అఖిల ప్రియా రెడ్డి ససేమిరా అంటున్నారు. అది తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన స్థానమని అందువల్ల ఆ టిక్కెట్ తమకే కేటాయించాలని ఆమె పట్టుపడుతోందట. దీంతో టీడీపీ అభ్యర్థి ఎంపికలో సందిగ్ధత నెలకొంది. 
 
అదేసమయంలో టీడీపీ టిక్కెట్ ఇవ్వకుంటే వైకాపా చేరి ఆ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తానంటూ శిల్పా మోహన్ బాహాటంగా ప్రకటించారు. దీంతో చంద్రబాబు బెంబేలెత్తిపోయి అఖిల ప్రియను బుజ్జగిస్తున్నారు. కానీ భూమా ఫ్యామిలీ మాత్రం ఆ టిక్కెట్ తమకే దక్కించుకోవాలన్న గట్టి ప్రయత్నంలో ఉంది. అవసరమైతే మంత్రి పదవిని సైతం త్యజించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద నంద్యాల సీటు భూమా ఫ్యామిలి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్కడ దినకరన్ అరెస్టు... ఇక్కడ విలీనం ఖాయమా? క్లైమాక్స్‌కు అన్నాడీఎంకే పాలిటిక్స్