Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.500, రూ.1000 నోట్ల రద్దు రాత్రి 8 గంటల తర్వాత ఎందుకు ప్రకటించారంటే...

దేశంలో పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కరెన్సీ కల్లోలం కేవలం భారత్‌ను మాత్రమేకాకుండా, ప్రపచం దేశాలను సైతం ఓ కుదుపు కుదుపుతోంది. ముఖ్యంగా స్వదేశంలో సామాన్య ప్ర

Advertiesment
currency notes
, గురువారం, 10 నవంబరు 2016 (08:39 IST)
దేశంలో పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కరెన్సీ కల్లోలం కేవలం భారత్‌ను మాత్రమేకాకుండా, ప్రపచం దేశాలను సైతం ఓ కుదుపు కుదుపుతోంది. ముఖ్యంగా స్వదేశంలో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు మంగళవారం రాత్రి 8 గంటల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. మంగళవారం పగలంతా మిన్నకుండిన.... ప్రధాని రాత్రి పూటే ఎందుకు ఆ ప్రకటన చేశారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై ఆర్థిక నిపుణులు ఇలా స్పందిస్తున్నారు. 
 
సాధారణంగా దేశంలోని అన్ని బ్యాంకుల్లో సాయంత్రం 5 గంటలకే లావాదేవీలన్నీ పూర్తిగా నిలిచిపోతాయి. ఆ తర్వాత ఆయా బ్యాంకుల్లో వెయ్యి, ఐదు వందల నోట్లు ఎన్ని ఉన్నాయో చెక్‌లిస్ట్ ఆర్బీఐకి చేరుతుంది. దీంతో మొత్తం క్యాష్ ఎంత ఉందనేది ఆర్బీఐకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ మొత్తం సమాచారం అందే వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగారు. 
 
ఇలా ఎందుకు ఆగారంటే.. చివరి నిమిషంలో రాత్రికి రాత్రి పెద్దమొత్తంలో కోట్లాది రూపాయలు చేతులు మారకుండా ఉండేందుకే ఇలా చేశారు. పెద్ద నోట్లు రద్దు చేశారని తెలియగానే బడా బాబులు తమకు తెలిసిన బ్యాంకు మేనేజర్లను ఆశ్రయించి తమ వద్ద ఉన్న నల్ల డబ్బును రాత్రికి రాత్రే బ్యాంకుకు తరలించి రూ.100, రూ.50 నోట్లుగా మార్చుకునే వెసులుబాటు ఉంది. 
 
ఇదే జరిగితే దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల నల్లడబ్బు తెల్ల డబ్బుగా మారిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతుంది. దీనిని నివారించేందుకే మోడీ ప్రకటన కోసం రాత్రి వరకు ఆగినట్టు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు నల్లడబ్బును తెల్లగా మార్చుకునేందుకు కొందరు బంగారంపై దృష్టి సారిస్తారు. షేర్ మార్కెట్లలోనూ పెట్టేందుకు ప్రయత్నిస్తారు. అందుకే అవి కూడా మూసేసిన తర్వాత మోడీ ప్రకటన వెలువడింది. 
 
అలాగే, సట్టా బజార్‌ (బెట్టింగ్ మార్కెట్)పైనా రద్దు ప్రభావం పడింది. అమెరికా ఎన్నికలపై కోట్లాది రూపాయల బెట్టింగ్ జరిగింది. రాత్రి ఒంటిగంట తర్వాత ఫలితాలు రావడం ప్రారంభమయ్యాయి. కానీ రాత్రి 12 తర్వాత కరెన్సీకి విలువ లేకుండా చేశారు. ఇలా అన్ని విధాలుగా ఆలోచన చేసిన తర్వాతే మోడీ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన వల్ల దేశ మార్కెట్ కుప్పకూలిపోగా, బంగారు ధరలు మాత్రం పెరిగాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ. 2000 ఎందుకు? రూ. 200 నోట్లు చాలు... మళ్లీ మోదికి చెప్తా... సీఎం చంద్రబాబు