రూ. 2000 ఎందుకు? రూ. 200 నోట్లు చాలు... మళ్లీ మోదికి చెప్తా... సీఎం చంద్రబాబు
దేశంలో నోట్ల రాజకీయం కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఈ విషయం నేను ఎప్పుడో చెప్పా... ఇప్పటికి ప్రధాని నిర్ణయం తీసుకున్నారని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రూ.500, రూ.1000 నోట్లు అభివృద్ధి నిరోధకాలుగా మారాయ
దేశంలో నోట్ల రాజకీయం కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఈ విషయం నేను ఎప్పుడో చెప్పా... ఇప్పటికి ప్రధాని నిర్ణయం తీసుకున్నారని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రూ.500, రూ.1000 నోట్లు అభివృద్ధి నిరోధకాలుగా మారాయని, అన్ని సమస్యలకు కారణాలయ్యాయని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుపై సీఎం మీడియాతో మాట్లాడుతూ, నేను ఎప్పుడో చెప్పాను... వీటిని రద్దుచేయాలని. వీటి రద్దుపై ప్రధానికి కూడా లేఖ రాశాను... ప్రధాని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.
రాజకీయం వ్యాపారంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ప్రధాని నిర్ణయం రాజకీయ అవినీతిని నిర్మూలిస్తుందన్నారు. మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తారని, సంఘ విద్రోహ శక్తులు, డ్రగ్ మాఫియా, టెర్రరిస్టులు వంటి వారి ఆగడాలకు ఇది సరైన సమాధానమన్నారు. నల్లధనం సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతోందని, ప్రధాని చర్య వల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
అయితే మళ్లీ రూ. 500, రూ. 2000 కరెన్సీ నోట్లను తీసుకురావడంపై మాట్లాడుతూ... ఈ నోట్లు అనవసరం అనేది తన అభిప్రాయమన్నారు. రూ. 200 నోట్లు తీసుకువస్తే సరిపోతుందని చెప్పుకొచ్చారు. పెద్ద నోట్లు.. రూ. 2000 తీసుకువస్తే కథ మళ్లీ మొదటికే వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. దీనిపై చర్చ జరగాల్సి ఉందన్నారు. ఒకవేళ పెద్దనోట్లు తీసుకువచ్చినా వాటిని ఉపసంహరించుకుంటే మంచిదన్నారు.
అర్ధరాత్రి మోదీ సాహసోపేతంగా చేసిన ఈ ప్రకటన క్రెడిట్ అంతా బాబుదే అన్నట్లు పేర్కొంటోంది. కానీ, చంద్రబాబు ఆశించినట్టుగా వాస్తవానికి మోడీ ప్రభుత్వం 500 నోట్లు రద్దు చేయలేదు. పైగా వెయ్యి నోట్ల స్థానంలో రెండువేల నోట్ల ప్రవేశపెట్టడం బాబు అంచనాలకు భిన్నంగా ఉంది. ఆయన ఆశించిన దానికి విరుద్ధంగా ఉంది.
అయితే మీడియా మాత్రం బాబు మాట గెలిచిందనే ప్రచారం మాత్రం సాగిపోతోంది. అందుకు తగ్గట్టుగా 500 నోట్లు రద్దు చేశారనే ప్రచారం సాగిస్తున్నారు. కానీ వాస్తవానికి 500 నోట్ల మార్పిడి మాత్రమే జరిగింది. కొత్త నోట్లు చెలామణీలోకి రాబోతున్నాయి. దానికితోడుగా వెయ్యి నోట్లకు డబుల్ చేస్తూ రెండు వేల నోట్లు ముందుకు రాబోతున్నాయి. తద్వారా బాబు చెప్పినట్టు పెద్ద నోట్ల రద్దు కావడం లేదు సరికదా రెండింతల రూ. 2000 నోటు ముందుకొస్తోంది. అంటే బాబు చెప్పిన మాటకు, వాస్తవ ఆచరణకు పొంతనలేనట్టే కదా.