Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహేతర సంబంధం పెట్టుకుంటే మహిళలను శిక్షించరా?

వివాహేతర సంబంధాలకు సంబంధించి ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిల్‌లో వివాహేతర సంబంధాల్లో మహిళలను శిక్ష పడట్లేదని.. పురుషులే శిక్ష అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు వివాహేతర సంబంధాలకు సంబ

Advertiesment
వివాహేతర సంబంధం పెట్టుకుంటే మహిళలను శిక్షించరా?
, శనివారం, 9 డిశెంబరు 2017 (10:51 IST)
వివాహేతర సంబంధాలకు సంబంధించి ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిల్‌లో వివాహేతర సంబంధాల్లో మహిళలను శిక్ష పడట్లేదని.. పురుషులే శిక్ష అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు వివాహేతర సంబంధాలకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 497ను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. 
 
వివరాల్లోకి వెళితే.. భారత సంతతి వ్యక్తి జోసఫ్ షినే (40) దాఖలు చేసిన ఈ పిల్‌లో.. ఐపీసీ 497 సెక్షన్ ప్రకారం ఏ వివాహిత వ్యక్తి అయినా మరో వివాహిత మహిళతో, ఆమె భర్త అనుమతి లేకుండా అక్రమ సంబంధం నెరపితే అది వ్యభిచారంగా పరిగణిస్తారన్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న పురుషులకే శిక్ష ఎందుకని ప్రశ్నించారు. 
 
మహిళలకు ఈ వ్యవహారంలో ఎందుకు శిక్ష వుండదు. అందుకే ఈ సెక్షన్ ప్రకారం కేవలం పురుషులనే శిక్షించి.. మహిళలను విడిచిపెట్టడం తగదని.. రాజ్యాంగ విరుద్ధంగా వున్న ఈ సెక్షన్‌ను కొట్టి వేయాలని జోసఫ్ షినే కోర్టును విజ్ఞప్తి చేశారు. ఈ పిల్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రకాశంలో పవన్.. బోటు బాధితులను పరామర్శించిన జనసేనాని