Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు ఆయనేనా?

Advertiesment
jp naddah

ఠాగూర్

, శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (11:51 IST)
భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడుని ఎన్నుకోనున్నారు. ప్రస్తుతం జయప్రకాష్ నడ్డా (జేపీ నడ్డా) గత 2020 నుంచి అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. 2019లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆ బాధ్యతలను చేపట్టారు. 
 
అయితే, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గత యేడాది ఆయన పదవీకాలం పొడిగించారు. ఆయన నాయకత్వంలోని పార్టీ మరోమారు కేంద్రంలో అధికారం చేపట్టింది. దీంతో నడ్డాను మంత్రివర్గంలోని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇపుడు ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడుని నియమించాలని పార్టీ యోచిస్తుంది. 
 
ఈ క్రమంలో తెరపైకి పలువురి పేర్లు వచ్చాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింథియా, బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, మహారాష్ట్ర సీనియర్ నేత వినోద్ తావడే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 
 
అయితే, వీరిలో శివరాజ్ సింగ్ చౌహాన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు బీజేపీ శ్రేణుల్లో ప్రచారం సాగుతుంది. కాగా, మార్చి 31వ తేదీ తర్వాత పార్టీ నూతన అధ్యక్షుడు పేరును అధికారింగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోన ఒకరిద్దరూ సీనియర్ నేతల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

AP State Budget 2025-26: Highlights: ఏపీ బడ్జెట్.. సూపర్ సిక్స్‌కు పెద్దపీట.. బడ్జెట్ హైలైట్స్ ఇవే