కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌లో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న వేళ ఈ మధ్యతర బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన భారతీయ జనతా పార్టీ ఈ మధ్యంతర పద్దులో జనాకర్షక నిర్ణయాలేవైనా ప్రకటిస్తుందా లేదా అన్నది ఇపుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ముఖ్యంగా, మధ్యంతర పద్దులో జనాకర్ష అంశాల జోలికి వెళ్లకుండా మూలధన వ్యయం పెంపు ద్వారా ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకే ప్రాధాన్యమిస్తుందా? లేదంటే సంక్షేమం, అభివృద్ధి అంశాల్లో సమతుల్యత పాటిస్తుందా? ఇలాంటి ప్రశ్నలపై అంతటా విస్తృత స్థాయిలో చర్చ సాగుతుంది.
తాత్కాలిక పద్దే అయినప్పటికీ ఎన్నికల యేడాది కావడంతో కేంద్రం తమపై ఎంతో కొంత కరుణ చూపుతుందని బడుగు జీవులతో పాటు వివిధ వర్గాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. అయితే, ఆర్థిక స్థిరీకరణపై ప్రధాని మోడీ సర్కారు పెద్దపీట వేయొచ్చని పారిశ్రామిక, వాణిజ్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం 11 గంటలకు ఈ మధ్యంతరపద్దను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
ఏదైనా అతిగా వినియోగించడం మంచిది కాదు.. విద్యార్థులకు ప్రధాని హితవు
ఒదైనా ఒక వస్తువును అతిగా వినియోగించడం ఏమాత్రం మంచింది కాదని విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హితవు పలికారు. సోమవారం జరిగిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఏదైనా అతిగా వినియోగిస్తే మంచిది కాదని... కాబట్టి విద్యార్థులు ఎప్పుడూ మొబైల్ వెంట పడకూడదని సూచించారు.
అవసరం ఉంటేనే తాను మొబైన్‌ను కూడా వినియోగిస్తానని లేకుంటే దాని జోలికే వెళ్ళనని తెలిపారు. విద్యార్థులు కూడా మొబైల్ ఫోన్లలో స్క్రీన్ టైమ్ అలర్ట్ టూల్స్‌ను ఉపయోగించాలన్నారు. సమయాన్ని గౌరవించాలని.... మొబైల్స్ చూస్తూ సమయాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు.
పిల్లల ఫోన్ల పాస్ వర్డ్‌ను తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాలని ప్రధాని మోడీ సూచించారు. టెక్నాలజీ నుంచి ఎప్పుడూ దూరం జరగకూడదని... అదేసమయంలో సానుకూల ప్రభావం చూపేలా మాత్రమే ఉపయోగించాలని, చెడుగా వినియోగించరాదని కోరారు.
పరీక్షా పే చర్చ కార్యక్రమంలో దాదాపు 2 కోట్ల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొంతమంది పాల్గొనగా... ఆన్‌లైన్ ద్వారా కోట్లాది మంది వీక్షించారు.