Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ మార్గంలో 130 కిమీ వేగంతో వందే భారత్ స్లీపర్ ట్రైన్ టెస్ట్ డ్రైవ్ సక్సెస్

Advertiesment
vande bharat sleeper

ఠాగూర్

, గురువారం, 16 జనవరి 2025 (10:00 IST)
అహ్మదాబాద్ - ముంబై సెంట్రల్ ప్రాంతాల మధ్య వందే భారత్ స్లీపర్ రైలును 130 కిలోమీటర్ల వేగంతో టెస్ట్ డ్రైవ్‌ను భారతీయ రైల్వే అధికారులు విజయవంతంగా నరి్వహించారు. ఈ విషయాన్ని వెస్ట్రన్ రైల్వే అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఈ మార్గంలో చేపట్టిన టెస్ట్ డ్రైవ్‌లలో భాగంగా, 16 బోగీలతో కూడిన వందే భారత్‌ రైలును బుధవారం మధ్యాహ్నం 1.50 గంటలకు ముంబై సెంట్రల్ అహ్మదాబాద్‌కు చేరుకుని మధ్యాహ్నం 2:45 గంటలకు అహ్మదాబాద్‌కు బయలుదేరిందని వెస్ట్రన్ రైల్వే అధికారులు వెల్లడించారు. 
 
ఈ రైలు ముంబై సెంట్రల్‌కు మధ్యాహ్నం 12.40 గంటలకు చేరుకోవాల్సి ఉందని, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 1.10 గంటలు ఆలస్యంగా చేరుకుందని రైల్వే అధికారులు తెలిపారు. "అహ్మదాబాద్ - ముంబై సెంట్రల్ మధ్య గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ స్లీపర్ రైలు యొక్క కన్ఫర్మేటరీ ఓసిల్లోగ్రాఫ్ కార్ రన్ (COCR) ట్రయల్ నిర్వహించాము" అని పశ్చిమ రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
 
ఈ టెస్ట్ డ్రైవ్‌లోని లోటుపాట్లను క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాత దేశంలోని రైల్వే పరికరాల రూపకల్పన, ప్రమాణీకరణకు భద్రత వహించే రీసెర్చ్ డిజైన్ మరియు స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) ద్వారా తుది సర్టిఫికేట్‌ను మంజూరు చేస్తుందని తెలిపారు. 
 
కాగా, సెమీ-హై-స్పీడ్ రైలులో 11 ఏసీ-3 టైర్ కోచ్‌లు, నాలుగు ఏసీ-2 టైర్ కోచ్‌లు, ఒక ఫస్ట్-క్లాస్ ఏసీ కోచ్ ఉన్నాయని పశ్చిమ రైల్వే అధికారులు తెలిపారు. మొబైల్ పరికరాల కోసం ఛార్జింగ్ పోర్ట్‌లు, ఫోల్డబుల్ స్నాక్ టేబుల్, ఇంటిగ్రేటెడ్ లైటింగ్ సిస్టమ్ మరియు ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సెటప్ వంటి ఫీచర్లతో ఇవి అమర్చబడి ఉన్నాయని తెలిపింది.
 
రైలులో సాఫీగా కదలడానికి కంబైన్డ్ గ్యాంగ్ వే, రెండు చివర్లలో డాగ్ బాక్స్‌లు, సరిపడే విధంగా ఓపెన్ ప్లేస్, అటెండర్ల కోసం 38 ప్రత్యేక సీట్లు ఉన్నాయి. అదనంగా, అన్ని కోచ్‌లు అగ్నిమాపక భద్రత కోసం హెచ్‌ఎల్3కి అనుగుణంగా ఉంటాయి. దృష్టిలోపం ఉన్న ప్రయాణీకుల కోసం బ్రెయిలీ నావిగేషన్‌ను కలిగి ఉంటాయి. ఏసీ ఫస్ట్‌క్లాస్ కోచ్‌లో 24 సీట్లు ఉండగా, సెకండ్ ఏసీ కోచ్‌లలో ఒక్కొక్కటి 48 సీట్లు ఉన్నాయి. 3వ ఏసీ కోచ్‌లలో ఐదు 67 సీట్లు, నాలుగు 55 సీట్లు ఉన్నాయని పశ్చిమ రైల్వే తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూజీసీ నెట్ పరీక్షల నిర్వహణ రీషెడ్యూల్...