Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎమ్మెల్యేది ఆత్మహత్య కాదు... హత్యే.. : బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తల వీరంగం

Advertiesment
ఎమ్మెల్యేది ఆత్మహత్య కాదు... హత్యే.. : బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తల వీరంగం
, మంగళవారం, 14 జులై 2020 (11:35 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రే ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక మార్కెట్‌లో ఆయన ఉరికంబానికి వేలాడుతూ కనిపించారు. అయితే, బీజేపీ కార్యకర్తలు మాత్రం తమ పార్టీ ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకోలేదనీ, చంపేసి ఉరివేశారంటూ ఆరోపిస్తున్నారు. 
 
ఎమ్మెల్యే మృతికి నిరసనగా 12 గంటలపాటు బంద్‌కు పిలుపునిచ్చిన బీజేపీ కార్యకర్తలు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. కుచ్‌బెహర్ ప్రాంతంలో బస్సులు ధ్వంసం చేశారు. రోడ్లు ఎక్కడికక్కడ దిగ్బంధించారు. మమత బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం నుంచే పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బంద్ నేపథ్యంలో మార్కెట్లు మూతపడ్డాయి.
 
బీజేపీ కార్యకర్తల ఆందోళనతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొడతున్నారు. కాగా, ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ తన గ్రామ సమీపంలోని బిందాల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, అది ఆత్మహత్య కాదని, హత్యేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని పశ్చిమ బెంగాల్‌కు కేంద్ర పరిశీలకుడు అయిన కైలాశ్ విజయ్ వర్గీయ డిమాండ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వ్యాక్సిన్ ఫలితాలు అదరహో... త్వరలోనే శుభవార్త : డోనాల్డ్ ట్రంప్