Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కూలిన చక్కి బ్రిడ్జి - హిమాచల్ ప్రదేశ్‌లో 14 మంది మృతి

chakki bridge
, శనివారం, 20 ఆగస్టు 2022 (11:44 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షాలతో అతలాకుతలమైపోతోంది. ఈ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తుంది. దీంతో అనేక వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా, కంగ్రా జిల్లాలో ఉన్న చక్కి బ్రిడ్జి శనివారం కూలిపోయింది. ఇది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను కలుపుతుంది. 
 
అలాగే, భారీ వర్షాలు కారణంగా కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 14 మంది వరకు చనిపోయినట్టు రాష్ట్ర అధికారులు వెల్లడించారు. చంబా జిల్లాలో వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 
 
మండి జిల్లాలోని బాగీ సుల్లాలో ఓ అమ్మాయి మృతదేహాన్ని గ్రామస్థులు స్వాధీనం చేసుకున్నారు. ఆ అమ్మయికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు వరద నీటి ప్రవాహంలో కొట్టుకునిపోయినట్టు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
క్లౌడ్‌బ‌స్ట్ కావ‌డంతో బాగీ నుంచి ఓల్డ్ క‌టోలా ప్రాంతంలో ఉన్న ఇండ్ల‌కు చెందిన కుటుంబాలు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లాయి. ఆక‌స్మిక వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌డం వ‌ల్ల మండి జిల్లాలో రోడ్ల‌న్నీ బ్లాక్ అయ్యాయి. దీంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించి పోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తను వేధించిన భార్య.. ముగ్గురు పిల్లలతో ఆత్మహత్యాయత్నం..