Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లోక్‌సభ ముందుకు వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు!!

Advertiesment
lok sabha house

ఠాగూర్

, బుధవారం, 2 ఏప్రియల్ 2025 (13:50 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టంది. అయితే, ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఏకమై ఆందోళనకు దిగాయి. బుధవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. దాదావు 8 గంటల పాటు చర్చ జరిపిన తర్వాత ఓటింగ్ నిర్వహిస్తారు. ఎలాగైనా ఈ బిల్లును సభలో ఆమోదింపజేసుకోవాలని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం గట్టి పట్టుదలగా ఉంది. అలాగే, విపక్షాలు కూడా ఈ బిల్లును అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. 
 
ఈ వక్ఫ్ సవరణ బిల్లులో వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లును కేంద్ర రూపొందించింది. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చేపట్టింది. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేసినట్టు కేంద్రం వాదిస్తుంది. నిజానికి గత యేడాది ఆగస్టు నెలలోనే లోక్‌సభలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. 
 
అపుడు దీనిపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపించింది. ఈ కమిటీ పలు ప్రతిపాదనతో బిల్లుకు ఆమోదం తెలుపడంతో బుధవారం సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంద. అయితే, పార్లమెంట్ ఉభయసభల్లో ఎన్డీయేకు పూర్తి మెజార్టీ ఉన్నందున బిల్లు ఆమోదానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కమలనాథులు గట్టిగా భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల వేతనం రూ.15 వేలు.. రూ.34 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు - ఐటీ శాఖ వింత చర్య!!