అఖిలేష్ నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి అన్నిట్లో తోడున్నా... ఈ శకుని (అమర్ సింగ్) మావయ్య
ఎస్పీ అధినేత ములాయం సింగ్ తనయుడు అఖిలేష్ యాదవ్ చిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి అన్నిట్లో తోడున్నానని, కానీ అఖిలేష్ ఇపుడు ఇలా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక పోతున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్ అన్
ఎస్పీ అధినేత ములాయం సింగ్ తనయుడు అఖిలేష్ యాదవ్ చిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి అన్నిట్లో తోడున్నానని, కానీ అఖిలేష్ ఇపుడు ఇలా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక పోతున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్ అన్నారు. అదేసమయంలో ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీలో జరుగుతున్న పరిణాలపై అమర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదేఅంశంపై ఆయన మాట్లాడుతూ అఖిష్ నిక్కర్లు వేసుకుంటున్నప్పటి నుంచి తనకు తెలుసని... చదువులు, ఎదుగుదల, వ్యక్తిగత జీవితం ఇలా అన్ని విషయాల్లో అతని వెనుకున్నా... ఇప్పుడు నన్నే ద్వేషిస్తున్నాడు అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. నా అనుకున్న వ్యక్తులే మనల్ని ద్వేషిస్తే ఎలా తట్టుకోగలం అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
తన గురించి అఖిలేష్ మాట్లాడుతున్న మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతోంది అన్నారు. మరోమాట లేకుండా తనను పార్టీ నుంచి గెంటేయాలంటూ అఖిలేష్ డిమాండ్ చేయడం బాధాకరమన్నారు. వాస్తవానికి తనకున్నవి రెండే కోరికలని... ఒకటి పార్టీ సుప్రీమోగా ములాయం ఉండాలని, రెండోది రాజకీయాల్లో అఖిలేష్ ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలన్నదే తన చివరి కోర్కెలన్నారు.