అపోలో ఉన్న అమ్మను నేనెందుకు చూడాలి: కెప్టెన్ విజయ్ కాంత్ ప్రశ్న
తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంతో అపోలోలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమెను త్వరలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు అమ్మ ఆరోగ్యంపై ప్రముఖులు ఆరాతీ
తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంతో అపోలోలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమెను త్వరలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు అమ్మ ఆరోగ్యంపై ప్రముఖులు ఆరాతీస్తున్నారు. పరామర్శిస్తున్నారు. అయితే డీఎండీకే చీఫ్, కెప్టెన్ విజయ్ కాంత్ మాత్రం అమ్మను ఆస్పత్రికి వెళ్ళి పరామర్శించలేదు.
ఈ నేపథ్యంలో విజయ్ కాంత్ అమ్మను పరామర్శించకపోవడంపై తాజాగా వివరణ ఇచ్చారు. జయలలితను చూసేందుకు నేనెందుకు వెళ్లాలి? ఆమె సంపూర్ణంగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. తన పార్టీ కార్యకర్త ఆస్పత్రిలో ఉంటే వెళ్ళి పరామర్శిస్తాను.. కానీ ఆమెను చూడాలని అవసరం ఏముందని ప్రశ్నించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి శనివారం ప్రకటించారు. ఐసీయూ నుంచి ఆమెను త్వరలో స‍్పెషల్ రూమ్‌కు మారుస్తామని తెలిపారు. జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి చేస్తామని ప్రతాప్ సి రెడ్డి చెప్పారు.