టీ తాగాలా..? ఆన్‌లైన్‌లో పే చేయండి. టీస్టాల్ యజమాని ఆఫర్
పెద్ద నోట్ల రద్దుతో చిన్న దుకాణాల వ్యాపారులు కష్టాల్లో ఉన్నారు. అలాగే నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల రద్దు కారణంగా వ్యాపారులు తమ వ్యాపారాలు జరగక ఇబ్బందిపడుతున్నారు. రోజుకు వ
పెద్ద నోట్ల రద్దుతో చిన్న దుకాణాల వ్యాపారులు కష్టాల్లో ఉన్నారు. అలాగే నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల రద్దు కారణంగా వ్యాపారులు తమ వ్యాపారాలు జరగక ఇబ్బందిపడుతున్నారు. రోజుకు వందలాది రూపాయాలను నష్టపోతున్నారు. అయితే ఢిల్లీలోని ఓ టీ స్టాల్ యజమాని వినూత్న ఆలోచనతో తన దుకాణాన్ని నడుపుతున్నారు. నగదు రద్దుతో తన వ్యాపారానికి నష్టం రాకుండా ఢిల్లీలోని టీ స్టాల్ యజమాని వినూత్నంగా ఆలోచించాడు.
టీ తాగాలనిపిస్తే వెంటనే తన టీ స్టాల్ వద్దకు వచ్చి మరీ టీ తాగాలని కోరుతున్నాడు. డబ్బులు లేవని ఇబ్బందిపడవద్దంటున్నాడు. పెద్ద నగదు నోట్లే ఉన్నా ఫరవాలేదంటున్నాడు ఆ టీ స్టాల్ యజమాని. టీ తాగాలనిపిస్తే ఆన్ లైన్‌లో డబ్బులు పే చేసి తన వద్ద టీ తాగాలని కోరుతున్నాడు ఢిల్లీకి చెందిన టీ స్టాల్ ఓనర్ బల్వీందర్ సింగ్ పేటిఎం ద్వారా ఆన్ లైన్ డబ్బులు పే చేసే అవకాశం ఉన్న కారణంగా తన వద్ద నిరభ్యంతరంగా టీ తాగాలని ఆయన కోరుతున్నాడు.