ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతిని క్యాబ్ డ్రైవర్ కాపాడాడు. ఈ వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ కావడంతో నెటిజన్లు క్యాబ్ డ్రైవర్, పోలీసుల తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్లితే.. ఓ మహిళ క్యాబ్‌లో వెళ్తూ అటల్ సేతు బ్రిడ్జిపై ఆగింది. ఆ తర్వాత క్యాబ్ దిగి అటల్ సేతు బ్రిడ్జి రేలింగ్ అంచున కూర్చొంది. క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడుతుండగానే ఆమె సడన్‌గా దూకే ప్రయత్నం చేసింది.
క్షణాల్లో స్పందించిన క్యాబ్ డ్రైవర్ వెంటనే ఆమెను పట్టుకున్నాడు. ఆ తర్వాత అటు నుంచి వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు ఆమెను పట్టుకొని సురక్షితంగా పైకి లాగారు. ఇదంతా అటల్ సేతు బ్రిడ్జిపై ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు ఉంది. ఈ ఘటనపై కేసు నమోదైంది.
బాధితురాలు ములుంద్‌లో నివాసం ఉండే 56 ఏళ్ల రీమా ముఖేష్ పటేల్‌గా పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.