ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజున జంటలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చి, డేట్‌లకు వెళతారు. సోషల్ మీడియా వివిధ వాలెంటైన్స్ డే సంబంధిత పోస్ట్‌లతో నిండి ఉండగా, నాసా కూడా తమదైన రీతిలో రోజును గుర్తించడానికి ఇన్‌స్టాలో సూపర్ పిక్ షేర్ చేసింది.
రోజా పువ్వును పోలిన 'కాస్మిక్ బ్లూమ్' చిత్రాన్ని స్పేస్ ఏజెన్సీ షేర్ చేసింది. సుమారు 500 మిలియన్ సంవత్సరాల క్రితం రెండు భారీ స్పైరల్ గెలాక్సీలు ఢీకొన్నప్పుడు, విలీనం అయినప్పుడు ఈ చిత్రం ఏర్పడిందని నాసా రాసింది. సుమారు 120 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఇది వుంటుంది.