Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూపీలో ఘోరం.. దోపీడికి వచ్చి.. మహిళపై సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లో అక్రమాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇంట్లో దోపిడి కోసం వచ్చిన దుండగులు.. ఆ ఇంట్లోని మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీ, ఘజియాబాద్ జిల్లాలోని కక్రా జిల్లాలో బుధవారం చోటుచే

Advertiesment
యూపీలో ఘోరం.. దోపీడికి వచ్చి.. మహిళపై సామూహిక అత్యాచారం
, శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (10:52 IST)
ఉత్తరప్రదేశ్‌లో అక్రమాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇంట్లో దోపిడి కోసం వచ్చిన దుండగులు.. ఆ ఇంట్లోని మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీ, ఘజియాబాద్ జిల్లాలోని కక్రా జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కక్రా జిల్లాలోని ఓ ఇంట్లో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఇంట్లోకి చొరబడిన కుటుంబసభ్యులను మారణాయుధాలతో బెదిరించి అందరిని తాళ్లతో కట్టేశారు. అనంతరం ఇంట్లోని నగదు, విలువైన వస్తువులను దోచేశారు. దొంగతనం ముగించుకుని తిరిగి వెళ్తుండగా.. వారిలోని ఇద్దరి కన్ను ఓ మహిళపై పడింది.
 
కుటుంబసభ్యుల కళ్ల ముందే ఆమెపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించి.. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ ఎమ్మెల్యే నాలుక కోసి తెస్తే రివార్డు.. కాంగ్రెస్ నేత ప్రకటన