అమ్మాయిలను తాకితే.. చెయ్యి నరికేస్తాం...
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాల సంఖ్య అధికంగా ఉంది. ఈ నేరాల అదుపునకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల కఠిన చర్యలు తీసుకుంటున్నా నేరాల సంఖ్య మాత్రం ఏమాత్రం
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాల సంఖ్య అధికంగా ఉంది. ఈ నేరాల అదుపునకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల కఠిన చర్యలు తీసుకుంటున్నా నేరాల సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపత్యంలో సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బీఎస్పీ) నేత అరవింద్ రాజ్బర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
యూపీలోని చందౌలీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... మహిళలు, లేదా యవతులను అసభ్యంగా తాకడానికి ప్రయత్నిస్తే వారి చేతిని నరుకుతామని హెచ్చరించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయమై ముందడుగు వేస్తామన్నారు.
కాగా, ఈయన తండ్రి ఓ ప్రకాష్ రాజ్బర్ ప్రస్తుత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆ మంత్రి తనయుడు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలకెక్కుతున్నాడు.