Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుమార్తెపై లైంగికదాడి చేయించిన కన్నతండ్రి.. ఎక్కడ?

Advertiesment
కుమార్తెపై లైంగికదాడి చేయించిన కన్నతండ్రి.. ఎక్కడ?
, బుధవారం, 13 అక్టోబరు 2021 (14:48 IST)
కన్నబిడ్డపై లైంగిక దాడికి పాల్పడిన ఓ కామాంధ తండ్రి.. ఆ తర్వాత 28 మందితో అత్యాచారం చేయించాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దీనికి సంబంధించి బాలిక విడుదల చేసిన ఓ వీడియో సందేశం ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తుంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌ జిల్లాలో ఈ కేసు నమోదైందని ఓ మీడియా సంస్థ పేర్కొంది. 
 
ఆ బాలిక వెల్లడించిన వివరాల ప్రకారం... 'మా నాన్న ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు. నేను ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే.. నాకు అసభ్యకరమైన చిత్రాలు చూపించి, లైంగికంగా లొంగదీసుకొనేందుకు ప్రయత్నించాడు. నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. 
 
ఆ తర్వాత నమ్మించి ఒకరోజు నాకు కొత్త బట్టలు కొనిచ్చి, బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. ఓ నిర్జన ప్రదేశంలో నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే.. మా అమ్మను చంపేస్తానని బెదిరించాడు. ఇది ఇక్కడితో ఆగలేదు. 
 
ఆ ఘటన తర్వాత మా నాన్న ఒకరోజు మత్తుమందు కలిపిన అన్నం తినిపించాడు. తర్వాత నన్ను ఒక హోటల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ నాపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నాకు స్పృహ వచ్చేసరికి నా ఒంటిపై దుస్తులు లేవు. తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. ప్రతిసారి నాకు ఇదే పరిస్థితి ఎదురయ్యేది. ఎవరో కొత్త వ్యక్తి వచ్చేవాడు. ఏ మాత్రం జాలి లేకుండా లైంగిక దాడికి పాల్పడేవాడు. ఇలా ఎన్నోసార్లు జరిగింది. 
 
ఒకసారి తిలక్ యాదవ్ వచ్చాడు. నేను వ్యతిరేకించడంతో నీ తండ్రే పంపాడంటూ అత్యాచారానికి పాల్పడ్డాడు. తిలక్‌తోపాటు ఆయన స్నేహితులు, బంధువులు, మా బంధువులు నన్ను ఇలాగే తీవ్రంగా హింసించారు’ అంటూ తన దయనీయ పరిస్థితిని పోలీసులకు వెల్లడించింది. ఈ బాధితురాలు ఎదుర్కొన్న దారుణ పరిస్థితి ప్రతిఒక్కరి హృదయాలను కలిచివేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళా కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ