Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#electionresults : బీజేపీ గెలుపు గుర్రాల్లో 114 మంది క్రిమినల్స్... కోటీశ్వరులు 244

అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బంపర్ మెజార్టీతో అధికారాన్ని హస్తగతం చేసుకోనుంది.

Advertiesment
Uttar Pradesh Election Results
, శనివారం, 11 మార్చి 2017 (13:00 IST)
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బంపర్ మెజార్టీతో అధికారాన్ని హస్తగతం చేసుకోనుంది. మొత్తం 403 సీట్లున్న అసెంబ్లీలో బీజేపీ 310 సీట్లలో ఆధిక్యంలో ఉంది. దీంతో ఆ సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 
 
మరోవైపు బీజేపీ తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లో 143 మంది నేరచరిత్ర కలిగినవారు ఉన్నారు. వీరిలో 115 మంది అభ్యర్థులు గెలుపొందనున్నారు. అంటే.. నేర చరిత్ర కలిగిన ప్రజాప్రతినిధులు శాతం 80.42 శాతంగా ఉంది. అలాగే, బీజేపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులంతా కోటీశ్వరులే కావడం గమనార్హం. వీరిలో 244 మంది విజయం సాధించనున్నారు. అంటే బీజేపీలో కోటీశ్వర ఎమ్మెల్యేల శాతం 77.96 శాతంగా ఉంది. 
 
ఇకపోతే ఎస్పీ - కాంగ్రెస్ పార్టీల విషయానికి వస్తే... 150 మంది క్రిమినల్స్‌కు టిక్కెట్లు ఇవ్వగా వీరిలో 22 మంది గెలుపు బాటలో ఉన్నారు. బీఎస్పీ తరపున 147 మందికి టిక్కెట్లు ఇవ్వగా ఆరుగురు మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు 408 మంది ఉండగా, వీరిలో నలుగురు ముందంజలో ఉన్నారు. 
 
కోటీశ్వర అభ్యర్థుల సంఖ్యను పరిశీలిస్తే... ఎస్పీ - కాంగ్రెస్ కూటమి తరపున 320 మంది బరిలోకి దిగగా, 58 మంది ఆధిక్యంలో ఉన్నారు. బీఎస్పీ తరపున 316 మందికి టిక్కెట్లు ఇవ్వగా 16 మంది, ఇతరుల తరపున 486 మంది పోటీ చేయగా ఆరుగురు కోటీశ్వర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇవి మోదీ వేవ్స్ కావు... మోదీ సునామీ, 2019లో కూడా దమ్ములేదు... ఒమర్ అబ్దుల్లా