Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇవి మోదీ వేవ్స్ కావు... మోదీ సునామీ, 2019లో కూడా దమ్ములేదు... ఒమర్ అబ్దుల్లా

జమ్ము-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇప్పుడు నరేంద్ర మోదీ సునామీ నడుస్తోందనీ, అవి కేవలం మోదీ సముద్రం అలలు అని ప్రత్యర్థి పార్టీలు అనుకుంటే పొరబాటని చెప్పుకొచ్చారు. గెలిచేందుకు 2019 సంవత్సరంలో కూడా ప్రత్యర్థి ప

ఇవి మోదీ వేవ్స్ కావు... మోదీ సునామీ, 2019లో కూడా దమ్ములేదు... ఒమర్ అబ్దుల్లా
, శనివారం, 11 మార్చి 2017 (12:52 IST)
జమ్ము-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇప్పుడు నరేంద్ర మోదీ సునామీ నడుస్తోందనీ, అవి కేవలం మోదీ సముద్రం అలలు అని ప్రత్యర్థి పార్టీలు అనుకుంటే పొరబాటని చెప్పుకొచ్చారు. మోదీని ఎదుర్కొనేందుకు 2019 సంవత్సరంలో కూడా ప్రత్యర్థి పార్టీలకు సాధ్యం కాదనీ, ఎందుకంటే 2019లో కూడా మోదీ సునామీ కొనసాగుతుందని జోస్యం చెప్పారు.
 
మరోవైపు సమాజ్ వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తండ్రి నుంచి పార్టీని లాగేసుకుని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న అఖిలేష్ యాదవ్ ను ప్రజలు తిరస్కరించారు. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భాజపాకు ఏకంగా 313 స్థానాలను కట్టబెట్టే దిశగా యూపీ ప్రజలు నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల ఫలితాల సరళి చూపిస్తోంది. దీనికి అఖిలేష్ యాదవ్ స్వయంకృతాపరాధమే అని తెలుస్తుంది. 
 
తన తండ్రి చెప్పిన మాటను పెడచెవిన పెట్టడమే కాకుండా ఎంపిక చేసిన అభ్యర్థుల్లో 50 శాతానికి పైగా అంతా నేరమయ చరిత్ర ఉన్నవారు కావడంతో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయినట్లు అర్థమవుతుంది. అఖిలేష్ చర్యల కారణంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోతున్నామంటూ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. వెంటనే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ములాయం సింగ్ యాదవ్ కు కట్టబెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుంటే ఈ మధ్యాహ్నం అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు.
 
ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ- అఖిలేష్ యాదవ్ ఇద్దరూ తాము లోకల్ బోయ్స్, నేషనల్ లీడర్ మనకెందుకు అంటూ ప్రచారం చేసారు. ఐతే లోకల్ బోయ్స్ ను జనం తిప్పికొట్టారు. డింపుల్ యాదవ్ పాటలను ప్రజలు ఎంజాయ్ చేశారు కానీ ఓట్లు మాత్రం వేయలేదు. మొత్తమ్మీద అఖిలేష్ యాదవ్ కు యూపీ ప్రజలు కోలుకోలేని షాకిచ్చి కూర్చోబెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూపీలో ఓబీసీ లేదా దళిత వర్గానికి చెందిన నేతను సీఎం చేయాలి: సాక్షి మహరాజ్